పచ్చకర్పూరం ముద్ద…

స్వామికి ప్రతిరోజూ గడ్డం దిగువన ఒకటిన్నర తులాల మేలిరకం పచ్చకర్పూరం ముద్దను అద్దాలి! దీని కథ ఏమంటే, రామానుజాచార్యులు వారి కోరిక మేర తిరుమలపై నివాసం ఉంటూ, పూలతోట పెంచుతూ, నిత్యం స్వామి వారికి నవనవలాడే నాజూకు పూలు, పూల దండలను శ్రద్ధతో సమర్పించే ఆప్తశిష్యుడైన అనంతుడు ఒకనాటి ఉదయం సతీసమేతంగా పూలతోటలో నీళ్ళు పోస్తుంటాడు. దంపతుల భక్తిభావానికి, నిస్వార్థ సేవకు మురిసిపోయిన శ్రీనివాసుడు బాల వటువురూపంలో వచ్చి వారికి సహాయ పడబోగా – ఆ అల్లరి పిల్లవాడు తమ పనులకు అడ్డు తగులుతున్నాడని భ్రమించి ఆగ్రహించిన అనంతుడు అతడిపై గడ్డిపార విసురుతాడు. ఆ గడ్డపార కొన ఆ బాలుని గడ్డం క్రిందుగా రాచుకుంటూ వెళుతుంది. వెంటనే ఆ బాలుడు ఆలయంవైపు పరుగిడుతూ అంతర్థానమవుతాడు!

తీరా, అనంతుడు పూలు తీసుకుని సాయంకాలం గర్భగుడికి వెళ్ళి చూడగా స్వామివారి గడ్డం దిగువన గాయం కనిపిస్తుంది. అతడికి వెంటనే ఉదయం జరిగిన సంఘటన గుర్తుకి వస్తుంది. పట్టరాని పశ్చాత్తాపంతో, ప్రేమాభిమానంతో అతడు తక్షణమే అక్కడ ఉన్న పచ్చకర్పూరం ముద్ద తీసుకుని గాయంపై గట్టిగా అడుముతాడు. దాంతో క్షణాలలో చిత్రంగా గాయం మాయమై – అక్కడ గుర్తుగా మచ్చ మాత్రం మిగిలిపోతుంది. అదిగో…అప్పటినుంచి స్వామివారి గడ్డంపై ఈ పచ్చకర్పూరం అద్దడమనే ఆచారం ఏర్పడింది. ఈ మచ్చ మనకు విగ్రహంలో అగుపించడం ఒక మహావింత!

జ్ఞాననేత్రం!

మన కళ్ళతో చుట్టూ పరికించినపుడు, సూక్ష్మపరిశీలను చేస్తే సృష్టిలోని సూక్ష్మాతిసూక్ష్మాలన్నీ గోచరిస్తాయి. అలాగే బ్రప్మండంగా ఆలోచిస్తే, ఈ సృష్టిలో అతి పెద్దదైన శూన్యం కనబడుతుంది. కొన్ని ప్రదేశాలు నక్షత్రమండలాలతో ఉంటూ మిగతా విశ్వమంతా అనంతశూన్యమే కనబడుతుంది. ఆ శూన్యం అందరి దృష్టికి రాదు. ఆ అనంత శూన్యమే ‘శివ’ అనబడుతుంది. నేతి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడ ప్రతీ వస్తువు శూన్యంలోనుంచే ఉద్భవించి, శూన్యంలోనే లయమవుతున్నట్లు చెబుతోంది. ఇది శివుని విషయంలో పరిశీలించగా, ఈ అనంత శూన్యమే మహాదేవుడు అని తెలుస్తోంది.

మనం శుభం కోరుకుంటూ భగవంతుని ఓ వెలుగుగా భావిస్తాము. కానీ, మనం ఆ పరిధి దాటి జీవితాన్ని శొధిస్తే, శూన్యంలో ఉండే దైవత్వం తెలుస్తుంది. ఈ భూమిపై మనకు తెలిసిన కాంతి సూర్యుడు మాత్రమే. ఆ సూర్య కాంతిని కూడ చేతిలో ఆపి, చీకటిని లేక చీకటినిఛాయను చేయవచ్చు. కానీ, చీకటి అన్నిచోట్ల అల్లుకుని ఉంటుంది.

కొందరు ఈ చీకటిని భూతంగా వర్ణిస్తారు. కానీ,  దైవత్వం అన్నిచోట్ల వ్యాపించి ఉన్నదని తెలిసినవాడు, ఆ దైవత్వమే ఈ అందకారమని తెలుస్తుంది. ఎందుకంటే, విశ్వమంతా అంధకారం కనుక, వెలుగు అనేది ఒక మూల నుంచి వస్తుంది. ఆ మూలం మండుతుంటుంది. ఆ మంటకు ఆద్యంతాలున్నాయి. ఆ మూలకు ఓ నియమిత పరిమాణం ఉంది. కానీ, చీకటికి మూలం లేదు. దానికి అదే ఆధారం.

అందువల్ల ‘శివ’ అంటే విశ్వంలోని శూన్యం. ఈ శూన్యం నుండే సృష్టి వచ్చింది. అంటా శివమయం.

శివరాత్రిరోజు శివుడు చలనరహిత, నిశ్చల, నిర్మల స్థాణువైనరోజు, కనుక సన్యాసులు మహాశివరాత్రి అచేతన దినంగా భావిస్తారు.

మహాశివరాత్రిరోజు, సంవత్సరంలోని మిగిలిన రోజులన్నింటినీ తలపించేరోజు. ప్రతినెల కృష్ణపక్షంలో 14వ రొజు శివరాత్రి దినమని మనకు తెలుసు. ఆధ్యాత్మికులు ఈరోజు ప్రత్యేక సాధనలు చేస్తారు. ఎందువల్లనంటే, నెలలో వచ్చిన ఈరోజున అనేక శక్తులు శరీరంపై ప్రభావాన్ని చూపుతాయి.

మహాశివరాత్రి రోజున నడుమును నిటారుగా వుంచి స్థిరాసనంలో కూర్చున్నవారు స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆరోజున నడుమును అడ్డంగా ఉంచి, శయస్థితిలో ఉన్నట్లుగా చేస్తే ఏటువంటి ఫలితం ఉండదు. ఆరోజున సహజంగా మన శర్శేఎరంలో జీవశక్తి (ప్రాణశక్తి) ఊర్థ్వముఖంగా పయనిస్తుంది. అప్పుడు పంచభూతాలు మనకు సహకరిస్తాయి. అలా ప్రాణశక్తి ప్రవహించడం వల్ల మానవునికి సర్వవికాసాలు, శక్తులు సిద్ధిస్తాయి. మానవుడు అప్పుడు అమితానంద స్థితిని చేరుకుంటాడు. ఆధ్యాత్మిక సాధనలో చేసే ప్రతిసాధన, ఇలా ప్రాణాధారశక్తి శరీరంలో ఊర్థ్వముఖముగా ప్రవహించడానికే.

ఈ దైవత్వాన్ని మనం అనుభవించాలంటే మనలోని శక్తులను అతి బృత్తర రూపంలోనూ, అతి సూక్ష్మరూపంలోనూ దర్శించగలగడమే. మహాశివరాత్రినాడు భూమి యొక్క ఉత్తరగోళంలో ప్రత్యేకమైన స్వాభావిక మార్పులు ఏర్పడతాయి. వాటిని మన శరీరంలోని ప్రాణాధార శక్తి ఊర్ధ్వముఖంగా పయనింపజేయడాన్నిగమనించవచ్చు. ఈ శక్తిని పొందడానికి నిశ్చలంగా నడుమును నిటారుగా ఉంచి స్థిరంగా కూర్చోవడమే. జీవశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం జీవరాశులకు అడ్డంగా, మానవులకు నిలువుగా వెన్నెముకను పెట్టి నడవడం. ఆ తర్వాతనే మానవునిలో తెలివి వచ్చింది. కనుక శివరాత్రినాడు నడుమును నిటారుగా ఉంచి మేల్కొని ఉంటే సత్పలితాన్ని పొందగలం. ఈవిధంగా ఉండి జీవశక్తిని ఉపయోగించు కుంటే మరియు మంత్రోచ్చారణ లేక ధ్యానం చేస్తే దివ్యత్వానికి దగ్గరగా చేరుకోగలం.

అలాగే భారతీయ సంస్కృతిలో ఒకానొకప్పుడు ఒక సంవత్సరంలో 365 పండుగలు ఉండేవి. అంటే, సంవత్సరంలో ప్రతిరోజూ పండుగే. ఈ పండుగలు అనేక కారణాలవల్ల, అనేక జీవితావసరాల కోసమై ఏర్పడినాయి. అనేక పండుగలు చారిత్ర్యాత్మక సందర్భాలలో, శత్రువిజయాలకో, జీవిత పరమార్థాలకో, లేక పంటలు చేతికి వచ్చిన సందర్భాలలోనో జరుపబడుతున్నాయి. విత్తనాలు ఇంటికి వచ్చినప్పట్నుంచి, పంట చేతికి వచ్చేంతవరకు పండుగలు ఉండెవి. కానీ, మహాశివరాత్రి ప్రత్యేకత, ఆవశ్యకత వేరు.  మహాశివరాత్రి ఆధ్యాత్మికావాదులకు, ప్రపంచాభిలాషగల వారికి చాలా అవసరం. మనం ‘శివ’ అనగానే ఓ దేవుని రూపాన్ని ఊహించుకుంటాం. అది అన్నింటికన్నా అతీతం. శివపురాణంలో శివుని జీవన గమనం మామూలు మనిషి జీవనంవలెనే కనబడుతుంది. ఆయన ఒకే సమయంలో అనేక రూపాలలో కనబడుతుంటాడు. ఆయన అతిసుందరుడు – అనాకారి, గొప్పసన్యాసి – గృహస్తు కూడ. ఒకే సమయంలో అన్ని కలిగినవాడు. ఆ పరమశివుని నమ్ముకుంటే ఈ జీవితచక్రాన్ని అధిగమించినట్లే. గృహస్తులంతా ఆయన్ని, ఈ మహాశివ రాత్రిని శివుని వివాహదినంగా భావించి కొలుస్తారు. సన్యాసులు, తాపసులు ఈ దినాన్ని శివుని అత్యంత అచేతన రూపదినముగా కొలుస్తారు. అనంతకాల తపఃశక్తి వలన శివుడు అచేతనుడైయ్యాడు. ఆయన చాల అచేతనుడైన శుభదినమే ఈ శుభరాత్రి, మహాశివరాత్రి. కాబట్టి మహాశివరాత్రి నాడు మనం చేయవలసినవి:

1. సాష్టాంగస్థితిలో పరుండరాదు. నడుమును నిటారుగా ఉంచి కూర్చోవలెను.
2. అలా ఉన్నంతమాత్రాన సరిపోదు. మనం మన ఉనికిని గుర్తించలెనంత స్థితికి చేరుకొనవలెను. ఇలా చేసినపుడు మనకు, ఈ జీవితం ఓ కొత్తకోణంలో కనిపిస్తుంది. ఫలితంగా ప్రతి విషయంలో ఓ స్పష్టత ఏర్పడుతుంది. ఇలా జీవితంలొ కొత్తదృష్టిని ఏర్పరచుకోనిదే శివ దర్శనం దుర్లభం. శివరాత్రిన ఆ ఆవకాశం లభిస్తోంది.

పుష్పదంతుడి ‘శివ మహిమ్నస్తోత్రమ్’

విశేష ప్రాచుర్యం పొందిన శివస్త్రోత్రాల్లో శివ మహిమ్నస్తోత్రమ్ ఒకటి. ఇది దక్షిణభారతంలో కంటే, ఉత్తర భాతరదేశంలో మరింత ప్రచారంలో ఉంది. అక్కడ ఏ ప్రముఖమైన శివాలయానికి వెళ్ళినా, ఈ స్తోత్ర ప్రారాయణలు వినవచ్చు. కాశ్మీర్ శైవులు ఈ స్తోత్రాన్ని ఎంతో మహత్తర మైనదిగా భావిస్తారు.

దీక్షా, దానం, తపః, తీర్థం, జ్ఞానం, యాగాదికాః క్రియాః
మహమ్నః స్తవ పాఠస్య కలాం నార్హంతి షొడశమ్

వ్రతాలు, దానాలూ, తపస్సులూ, తీర్థయాత్రలూ, శాస్త్రజ్ఞానం యాగాది కర్మాలూ – వీటన్నిటివల్ల కలిగే ఫలం, శివమహిమ్నస్తోత్ర పఠనంవల్ల కలిగే ఫలంలో పదహారో వంతు కూడా ఉండదట.

మహేశాత్ నాపరో దేవః మహిమ్నః నా పరో స్తుతిః
అఘోరాత్ నా పరో మంత్రః తత్త్వం గురో పరమ్

మహేశ్వరుడుని మించిన దేవుడు లేదు. మహిమ్న స్తోత్రాన్ని మించిన స్తుతి లేదు. అఘోర మంత్రాన్నిమించిన మంత్రం లేదు. గురువును మించిన పరతత్త్వం లేదు అనే శ్లోకం ద్వారా శివమహిమ చెప్పబడుతోంది.

పాశ్చాత్య చరిత్రకారులు, ఈ స్తోత్రాన్ని గ్రహిలుడు అనే కవి రచించినట్లు చెబుతారు. ఈ కవి క్రీ.శ.9 వ శతాబ్దం కంటే ఖచ్చితంగా ముందరివాడే. ఎందుకంటే, 9-10 శతాబ్దాల నాటికి ఈ స్తోత్రం బాగా ప్రసిద్ధమైపోయింది. ఈ స్తోత్రం చెక్కి ఉన్న క్రీ.శ.1063 నాటి శిలా ఫలకం ఒకటి దొరికింది.

అయితే ఈ స్తోత్రాన్ని మొదట చెప్పింది పుష్పదంతుడు అనే గంధర్వుడని స్తోత్రం చివరి శ్లోకాలలో ఉంది. ఈ పుష్పదంతుడిది ఓ విచిత్రమైన కథ.

ఒకానొక కాలంలో కాశీలో గోవిందభట్టు అనే బ్రాహ్మనుడుండేవాడు. ఒకరోజు ఆయన ఇంటికి అతిథిగా వచ్చిన ఒక సాధువును ఆ బ్రాహ్మణుని కుమారులు గేలి చేసి అవమానించారట. సాధువుకు కోపం వచ్చి ఇలాంటి ఇంటి అతిథ్యం నాకు వద్దని వెళ్ళిపోయాట్ట. ఈ బ్రాహ్మణుడు తన కుమారులను ఇంటి నుంచి బహిష్కరించి, సాధువుకు క్షమాపనలు చెప్పి వెనక్కి పిలుచుకొచ్చి ఆతిథ్యమిచ్చాడట. అలా ఇంటి నుంచి వెళ్ళిపోయిన భ్రాహ్మణ కుమారులలో ఓకడు, తన తప్పుకు పశ్చాతాపపడి హిమాలయాలలో తపస్సు చేసి, శివుని మెప్పించాడు. మనణానంతరం కైలాశ ప్రాప్తిని పొందాడు. గురువుల దగ్గర శాస్త్రాధ్యయనం చేస్తుండగా, ఒకరోజు యాదృఛ్ఛికంగా ఆ దేశపు రాకుమారి అతడిని ఒక ఉద్యాన వనంలో చూసి మోహిస్తుంది. చేతిలో ఉన్న పుష్పాన్ని తన దంతానికి తాకించి, ఆ సైగ ద్వారా పుష్పదంతమనే చోటగల ఆలయానికి రమ్మని రహస్య సందేశం పంపుతుంది. బ్రహ్మణ కుమారుడు ఆమెను కలసి, ఆమె కోరిక మేర ఆమెను పెళ్ళాడి, ఆ దేశానికి రాజవుతాడు. మరణానంతరం కైలాసం చేరుకుంటాడు.

అక్కడ ఓసారి పార్వతీపరమేశ్వరుల రహస్య సంభాషణలు వినే ప్రయత్నం చేసి, పార్వతీదేవి ఆగ్రహానికి గురై మరలా మానవజన్మను ఎత్తాల్సి వచ్చింది. వరరుచి అనే వ్యాకరణవేత్తగా పుట్టి, ఆ తరువాత జన్మలో గంధర్వుడయ్యాడట. ఏ జన్మను ఎత్తినప్పటికీ శివభక్తిని వదల్లేదు. గంధర్వునిగా అదృశ్యరూపంలో వెళ్ళి, ఒక రాజుగారి తోటళొ పూలన్నీ తన శివపూజకు కోసి తెచ్చుకునేవాడు. ఒకనాడు ఆ తోటలో శివపూజ నిర్మాల్యాన్ని తొక్కాడట. దాంతో గంధర్వశక్తులూ, అదృశ్యరూపం కోల్పోయాడట. రాజభటులు శిక్షిస్తారని అనుమానం కలిగి, ఈ శివమహిమ్నస్తోత్రం గానం చేసి శివుని మెప్పించి, తిరిగి కైలాసంలో శివపార్వతులను సేవించే భాగ్యాన్ని పొందాడట.

శివమహిమ్న స్తోత్రమ్ 31 శ్లోకాల చిన్న స్తోత్రమే. కానీ, చాలా ప్రసిద్ధి పొందింది. ‘మహిమ్నః’ అనే శ్లోకంలో మొదలవుతుంది కనుక, దీన్ని శివమహిమ్న స్తోత్రం అని అంటారు.

మహిమ్నః పారంతే పరమ విదుషః యది అసదృశీ
స్తుతిః బ్రహ్మదీవామపి తదవసన్నాః త్వయి గిరః
అథ అవాచ్యః సర్వః స్వమతి పరిమాణావధి గృణన్
మమాప్యేష స్తోత్రే, హర నిరపవాదః పరికరః

‘ఓ శంకరా! నీ మహిమలు సంపూర్ణంగా తెలియని నాలాంటివాడు స్తోత్రం చేస్తున్నాడని, అది తగని పని అనుకోవద్దు. నీ మహిమలు పూర్తిగా తెలిసినవాళ్ళే నిన్నుస్తుతి చేయాలంటే అది అసలు కుదిరే పని కాదు. అందుకు బ్రహ్మాదులకు కూడ మాటలు చాలవు. కనుక, చాలీచాలని మాటలతోనే నా చేతయినట్టు నేను నిన్నిలా స్తోత్రమ్ చేస్తున్నాను’ అని కవి సవినయంగా ఆరంభిస్తాడు.

‘నీ తత్త్వం ఆవాజ్మానసగోచరం. ఉపనిషత్తులు కూడ నిన్ను ‘నేతి-నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అని తప్ప, ఇదమిత్థం అని స్పష్టంగా చెప్పలేకపోయాయి. అలాంటి నిరాకారుని గ్రహించడం, స్తుతించడం అసాధ్యం. అదే నామరూపాలు గల శివుడుగా నిన్ను భజించడం అంటే ఎవరి మనసు ఉప్పొంగదు?’

‘ఓ శంకరా! అమృతప్రాయమైన తేనెలొలికే మాటలకు నువ్వు సృష్టికర్తని. కనుక, ఇక ఆ బృహస్పతి మాట్లాడినా నీకు రుచించదు. ఇక నావంటి అల్పుడి స్తోత్రం నీకెలా నచ్చుతుంది? నచ్చదని నాకు తెలుసు. నేను ఈ స్తోత్రం చెప్పుకునేది నీకోసం కాదు. నీ గుణ గాన పుణ్యంవల్ల నన్ను నేను పునీతుడిని చేసుకునేందుకు మాత్రమే!’ అంటాడు పుష్పదంతుడు.

ఈస్తోత్రంలో అన్నింటికంటే ప్రసిద్ధమైన శ్లోకమిది.

త్రయీ! సాంఖ్యం, యోగః పశుపతి మతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే ‘వరమిద మదః’ పథ్యా మితి చ
రుచీనాం వైచిత్ర్యాత్ ఋజు  కుటిల నానా పథ జుషాం
నృణాం ఏకః గమ్యః త్వమసి పయసాం అర్ణవ మివ

మూడు వేదాలలో చెప్పిన కర్మకాండ మార్గం, సాంఖ్యయోగ మార్గం, పతంజలి యోగమార్గం, శైవ మార్గం, వైష్ణవమార్గం – ఇలా రకరకాలుగా సాగించుకునే మోక్షప్రస్థానంలో ‘ఇది శ్రేష్టమూ, అది హితకరం’ అనుకుంటూ తమ తమ అభిరుచుల వైవిధ్యం వల్ల మనుషులు వేరు వేరు మార్గాలను అవలంబిస్తారు. కానీ, వాటన్నింటికి గమ్యస్థానం ఒకటే. ఆ గమ్యం నువ్వే. నదులన్నింటికీ సముద్రంలాగ.

‘నిరీశ్వరవాదులు తర్కానికి అతీతుడివైన నీ మహిమలు తెలుసుకోలేక కుతర్కంలో ప్రపంచాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఈ లోకంలో ఎంతో వైచిత్రీ, భిన్నత్వం కనిపిస్తాయి. అధిష్ఠాతవు నువ్వు లేకపోతే, ఈ భువనాలన్నింటినీ ఎవరు నిర్మిస్తారు? ఏ పరికరంతో నిర్మిస్తారు? మందబుద్ధులకు మాత్రమే ఈశ్వరుడున్నాడా? లేడా? అన్న అనుమానాలు కలుగుతాయీ అంటుంది ఈ స్తోత్రం.

సరళంగా, సుందరంగా రచించబడిన ఈ స్తోత్రంలో దీర్ఘమైన సమాసాలు, కష్టమైన పదాలేమాత్రం కనిపించవు. ఇందులో శివమహిమలు, తత్త్వమూ అనేక విధాలుగా వర్ణించబడింది. ప్రతీశ్లోకంలో శబ్దగాంభీర్యం, అర్థగౌరవం చెట్టాపట్టాలుగా నడుస్తుంటాయి.

మహాచార్యులు శ్రీ మధుసూదన సరస్వతి శివ మహిమ్న స్తోత్రానికి వ్యాఖ్యానం రచించారు.

ఈ శివమహిమ్న స్తోత్రం శివభక్తులందరూ తప్పక చదవ వలసిన స్తోత్రం.

పంచాక్షరీ…

ఈశ్వరుని పంచముఖాల నుండి శ్రీశివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు (న – మ – శి – వా – య) అందులో నుండి పంచభూతాలు, వాటి నుండి ఈ సమస్త జగత్తు పుట్టిందని చెబుతారు. అందువల్లనే ఈ లోకాలన్నింటికీ పంచాక్షరీ మహామంత్రం తల్లిగా నిలిచి శుభాలను కలిగిస్తోంది.

దిశ

పేరు

మండలం

బీజాక్షరం

నిర్వహణ

శివుని ఊర్ధ్వముఖం

ఈశానం

ఆకాలమండలం

మోక్షం
శివుని పూర్వముఖం తత్పురుష వాయుమండలం

విరక్తి
శివుని దక్షిణముఖం అఘోర అగ్నిమండలం

సంహారం
శివుని ఉత్తరముఖం వామదేవ ఉదక మండలం

వా

పాలన
శివుని పశ్చిమ ముఖం సద్యోజాత భూమండలం

శి

సృష్టి

ఆసేతు హిమాచలం శివారాధన వ్యాప్తమై ఉన్నది. వేదాలు, పురాణాలు, ఆగమాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు కూడ శివతత్త్వాన్ని, శివయోగాన్ని బహువిధాలుగా విశదపరిచాయి.

ఓంకారవదనే దేవి ‘వ’ ‘య’ కార  భుజద్వయీ ‘శి’కార దేహమధ్యాచ ‘న’ ‘మ’ కార పదద్వయీ పంచాక్షరీ మంత్రానికి ఓంకారం ముఖం వంటిది. ‘వ’కార, ‘య’కారాలు బాహువులు. ‘శి’కారం నడుము అయితే, ‘న’, ‘మ’కారాలు పాదయుగ్మములు.

నమశ్శంభవే చ మయోభవేచ నమశ్శంకరాయ చ
మయస్కరాయ చ నమశ్శివాయ చ శివ తరాయచ

అని నమకంలొ శంభు – శంకర – శివ అంటూ మూడు దివ్యనామాలతో, ఆ పరాత్పరుని కీర్తించాయి. ‘శివయోగం’ సర్వోత్కృష్టమని, శాస్త్రాలు చెప్పడమేకాదు, కాశ్మీరశైవం, శుద్ధ శైవసిద్ధాంతం, వీరశైవం, పాశుపతం, మిత్రశైవం వంటి అనేక సంప్రదాయాలు మన భారతదేసమంతా వ్యాప్తి చెంది ఉన్నాయి.

‘శివ’ శబ్దానికి అనేక నిర్వచనాలున్నాయి. ‘శుభం, క్షేమం, శ్రేయం, మంగళం’ అని కొన్ని అర్థాలు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయతత్త్వమే శివుడు. శాంతమే శివుడు. అదే శివతత్త్వం. అన్నింటికీ ప్రకాశవంతం చేసే మూలచైతన్యమే శివుడు. వశి – శివ సమస్తాన్నీ తన వంశంలో ఉంచుకున్న వాడే సర్వేశ్వరుడు. అతడే ఇచ్ఛా – జ్ఞాన – క్రియా శక్తులతో కూడిన పరమేశ్వరుడు, సర్వ జగత్కారణుడు, ఆ తత్త్వమే ఆయన పంచాముఖాలలో గోచరిస్తుంటుంది.

శ్రీ పంచముఖాంజనేయ అవతారం…

ఈస్వామి ఐదుముఖాలతో, పది భుజాలతో, పది ఆయుధాలను ధరించి దర్సనమిస్తుంటాడు. తూర్పున వానరముఖం, దక్షిణాన నారసింహ ముఖం, పశ్చిమాన గరుడముఖం, ఉత్తరాన వరాహముఖం, పైభాగంలో హయగ్రీవ వదనంతో ఈ స్వామి విలసిల్లుతుంటాడు. ప్రతి ముఖంలో త్రినేత్రుడై ప్రకాశిస్తుంటాడు. స్వామి పది చేతులలో 1.కత్తి, 2.ఢాలు, 3.పుస్తకం, 4.అమృత కలశం, 5.అంకుశం 6.గిరి, 7.హలము, 8.కోడు, 9.సర్పము, 10.వృక్షము కనిపిస్తుంటాయి. ఈ ఆయుధాలన్నీ శత్రువుల గర్వాన్ని అణచి, జ్ఞానదీపాన్ని వెలిగించి, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసేవే. ఇది ఆంజనేయుని పరిపూర్ణరుద్రావతారం. ఈ అవతార మూర్తిని విభీషణుని కుమారుడైన నీలుడు లంకారాజ్యానికి యువరాజుగా పరిపాలన చేస్తున్న సమయం. అత్యంతబల సంపన్నుడైన నీలుడు సమస్త విద్యలలో పండితుడు. ధర్మాచరణంపట్ల అనురాక్తిగాలవాడు. సంపదలలో కుబేరునికి దీటైనవాడు. అయినప్పటికీ నీలునికి తృప్తి కలుగలేదు. అతని మనసులో ఇంకా ఐశ్వర్యాన్ని సేకరించాలన్న తపన, ఒకరోజు నీలుడు తండ్రి విభీషణునితో, “తండ్రీ! మనకు సంపదలకు, వైభావాలకు లోటు లేదు. కానీ, ఎంత ఉన్నప్పటికీ, మన దగ్గర చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు లేవు. అవి లేకపోవడం నా మనసెంతో వేదనకు గురవుతోంది. విష్ణుస్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తికి నువ్వు భక్తుడవు. నీకు ఆ మహనీయుడు ఆరాధ్యదైవం. అయినప్పటికీ, నువ్వు వాటిని సాధించాలేకపోయావు. వాటిని నువ్వెందుకు పొందలేకపోయావు? అయితే, నువ్వు నాకిప్పుడు అనుమతినిస్తే క్షణకాలంలో వాటిని సాధించి తీరుతాను. నన్ను ఆశీర్వదించు తండ్రీ!” అని పలికాడు.

కొడుకు మాటలు విన్న విభీషణుడు, “పుత్రా! రామభక్తిని మించిన సంపదలు మనకెందుకు? ఆ మహనీయుని అనుగ్రహం ఉంటే చాలు, అదే మనకు సర్వానందదాయకమైంది. దానిని మించిన సిరిసంపదలతో మనకేమి పని? అంతకు మించి పేరు పెన్నిధులు మనకెందుకు? చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు రామభక్తికి సరితూగేవి కావు. అందువల్లనే వాటి పట్ల నాకు అనురక్తి లేదు. వాటిపై నీకు అమిత ఇష్టం అయినట్లయితే, వాటిని నువ్వు సాధించుకో. అయితే ఒక విషయం, మన భూలోకవాసులం కనుక అవి మనకు సులువుగా లభించవు. వాటిని పొందాలంటే దైవశక్తిని సంపాదించాలి. దైవశక్తి కావాలంటే దేవతలను ఆరాధించాలి. అందుకై ముందుగా గురువులను ఆరాధించి, వారి ఆశీస్సులను పొందాల్సి ఉంటుంది. తద్వారా లోకోత్తరశక్తులను పొందగలిగితే, అటుపై నీ కోరిక నెరవేరుతుంది” అని హితవచనాలను పలికాడు.

తండ్రి ఆజ్ఞను శిరసావహించిన నీలుడు, తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి, కులదైవమైన శుక్రాచార్యుని ఆశ్రయించి పన్నెండు సంవత్సరాలు భక్తిప్రపత్తులతో సేవించి, గురువును ఆనందపరిచాడు. నీలుని మనసులోని కోరికను మన్నించిన శుక్రుడు, “నాయనా, నీలా! నీ కోరిక నెరవేరాలంటే, అందుకు తగిన పరమాద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం శ్రీరామచంద్రుని పరమభక్తాగ్రేసరుడైన ఆంజనేయుని పరమ పవిత్ర మంత్రరాజము. దానికితోడు ఒక వ్రతం గురించి కూడ చెబుతానూ. ఆంజనేయుని అవతారాలలో పంచముఖ ఆనంజనేయుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఎంతటి అసాధ్యమైన పని అయినప్పటికీ సుసాధ్యమవుతుంది. అంటే, సాధించలేనిదంటూ ఏమీ ఉండదు" అని తెలిపి, దివ్యమైన హనుమ మంత్రాన్ని నీలునికి బోధించి, వ్రతం కూడ చేయించాడు. నీలుడు శుక్రుని ఘనంగా సత్కరించి, ధ్యాన నిమగ్నుడయ్యాడు.

కొంతకాలం తరువాత నీలుని ప్రార్థనకు సంతుష్టుడైన హనుమంతుడు, పంచాముఖాంజనేయ రూపంలో నీలునికి దర్శనమిచ్చాడు. నీలుని బహువిధాలుగా స్వామిని స్తుతించగా, నీలుని మనసెరిగిన ఆంజనేయుడు, “భక్తా, నీలా! నీ కోరిక త్వరలో నేరావేరుతుంది. నువ్వు నా పరమభక్తుడవు. నీ తండ్రి అత్యంత మిత్రుడు. ఆత్మబంధువుకంటే ఎక్కువ. ఆందుకే నువ్వు నాకు అత్యంతప్రీతి పాత్రుడవు. నువ్వుకోరుకున్న విధంగానే చింతామణి మొదలైన దివ్యసంపదలు నీకు సొంతమవుతాయి. వాతితొపాటు శీలసౌందర్యాది విశేషగుణ  నిధియైన వసుందరిని కూడ పొందగలవు. అందుకే ఈ పవిత్రక్షేత్రం నీ పేరుతో నీలాద్రిగా వ్యవహరింపబడుతుంది” అని నీలుని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. తన కోరికలను సిద్ధింపజేసుకున్న నీలుడు గురువు శుక్రుడు, తల్లిదండ్రులకు మొక్కి, వారి ఆశీర్వాదాలను అందుకున్నాడు. అనంతరం దేవలోకంపై దండయాత్ర చేయ సంకల్పించిన నీలుడు, ఇంద్రుని వద్దకు దూతను పంపి తన ఉద్దేశ్యాన్ని వినిపింపజేసాడు. “ఓయీ ఇంద్రా! గతంలో మా పెద్దనాన్న కొడుకు చేతిలో పరాజితుడవై బందిపబడ్డావు. ఇప్పుడు విభీషణుని కుమారుడనైన నేను, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను.  నాతో యుద్ధం చేసి పరాభింపబడతావా? లేక చింతామణి, కామధేనువు, కల్పతరువు మున్నగు సంపదలను ఇస్తావా? ఏది ఏమైనా, నువ్వు నాతో యుద్ధం చేయలేవు కనుక, ఆ దివ్యరత్నాలను నాకివ్వు, బ్రతికిపో. నీలుని సందేశాన్ని విన్న ఇంద్రుడు మండిపడ్డాడు. “ఎంతోమంది రాక్షసులను తుదముట్టించాను. ఈ నీలుడు నాతో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. నీలునికి నా వజ్రాయుధసామర్థ్యం తెలిసినట్లు లేదు. వందల, వేల కోట్లకొలది రాక్షసులను నా వజ్రాయుధం సంహరించింది. అదలావుంటే, నీలుడొకలెక్క?! అందుకే ఈ దూతను శిక్షించి, పరాభావించి పంపించండి" అని ఇంద్రుడు ఆజ్ఞాపించడంతో దేవతలు రాయబారిని పంపారు. రాయబారి నీలునికి ఈ ఉందంతాన్ని చెప్పగా, ఆగ్రహించిన నీలుడు దేవలోకంపై యుద్ధభేరిని మోగించాడు.

దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కామరూప విద్య పాండిత్య ప్రవీణులైన దానవుల మాయోపాయాలకు దేవతలు ఎదురొడ్డి నిలువలేకపోయారు. ఇంద్రుడు రెట్టించిన పౌరుషంతో నీలుపైకి ఉరికి, “ఓయీ! నీలా! వాలి నా పుత్రుడు. అతడు నీ పెదనాన్న చంకలో పెట్టుకుని సప్త సాగరాలలో ముంచగా, ఎలాగో ప్రాణాలను దక్కించుకుని బ్రతికిన విషయం నీకు తెలియదా?!” అని ఇంద్రుడు చెబుతుండగా, నీలుడు మరింతగా రెచ్చిపోయి యుద్ధాన్ని చేయసాగాడు. నీలుడు ప్రయోగించిన అస్త్రాలను ఇంద్రుడు భగ్నం చేయగా, ఇంద్రుని వజ్రాయుధాన్ని నీలుడు ఒక్క బాణంతో అణిచి వేశాడు. ఇంద్రుడు అంకుశంతో విజృభించగా, నీలుడు దానిని గదాఘాతంతో ఖండించాడు. అనంతరం నీలుడు పదునైన కత్తిని చేతబూని ఇంద్రుని శిరస్సును ఖండించేందుకు ముందుకు ఉరకగా, అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మ నీలునితో, "ఓయీ నీలా! నీ తండ్రి రామభక్తుడు, రాముడంటే శ్రీమహావిష్ణువే. ఆ మహావిష్ణువుకు సోదరుడు. ఈ ఇంద్రుడు. అందువల్ల ఇతడు నీకు మిత్రుడేగానీ, శత్రువుకాదు. ఇతనితో తగవులాట వద్దు. ఇద్దరూ స్నేహితులుగా మసలండి. నీ కోరికను నేను నెరవేరుస్తాను. చింతామణి వంటి దివ్య వస్తువులన్నింటిని నేను అనుగ్రహిస్తాను. నీకు మరో విషయాన్ని చెబుతాను. శ్రద్ధగా విను.

పూర్వం అత్రిమహాముని హిమాలయ పర్వత సానువుల్లో సంచరిస్తుండగా, ఆ మహనీయుని నేత్రాల నుండి దివ్యతేజస్సు వెలువడింది. ఆ తేజస్సు, అందులోని వృక్షాలతో కూడి పలురీతులుగా వ్యాపించింది. వాయుదేవుడు ఆ దివ్యతేజాన్ని రెండు రాశువులుగా విభజించగా, అందులో నుంచి సౌందర్యనిధియగు చంద్రుడు ఉద్భవించాడు. రెండవ రాశి నుంచి త్రిభువన సుందరియైన వనసుందరి జనించింది. ఆ సౌందర్యవతి మధువుతో పెంచబడింది. అమృతస్వరూపిణి కాబట్టి దివ్యమణులతో పాటుగా కన్యామణి కూడ గ్రహించి సుఖించు. నువ్వు పంచముఖ ఆంజనేయుని ఆరాధించనందువల్ల మాకు కూడ గౌరవ పాత్రుడవయ్యావు అని చెప్పాడు.  బ్రహ్మ ఇలా చెప్పడమే కాక, మహత్తర శక్తి సంయుతమైన హనుమద్ర్వతాన్ని ఉపదేశించాడు. ఇంద్రునిచే చింతామణి మొదలైన దివ్యమైన వస్తుసంపదల తోడుగా సౌందర్యరాశియైన వనసుందరిని కూడ అర్పింపజేసాడు. ఆవిధంగా హనుమదనుగ్రహం వలన ప్రాప్తించిన సంపదలతో నీలుడు హనుమద్భక్తులలో అగ్రగణ్యునిగా వెలుగొందాడు. నీలునికి హనుమంతుడు మాఘమాసం ఆర్ధ్ర నక్షత్రంతో కూడిన దినంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే లంకలో సీతాదేవికి పంచాముఖాంజనేయ రూపాన్ని స్వామి ప్రదర్శించినట్లు మనకు తెలుస్తోంది. రావణవధ జరిగిన అనంతరం, లోకాలకు దుష్టరాక్షసపీడ విరగడైందని శ్రీరామచంద్రుడు తృప్తిపడుతున్న సమయంలో ఆకాశవాణి ఈ తీరుగా పలికింది. “శ్రీరామచంద్రా! రావణసంహారం జరిగిందని నువ్వు తృప్తి పడుతున్నావు. అంతటితో నీ కర్తవ్యం ముగియలేదు. గగనతలాన వేలవేల యోజనాల దూరంలో శతకంఠుడనే రాక్షసుడు తిరుగూన్నాడు. కడు దుష్టుడైన ఆ రాక్షసుడు, మహాబలశాలి. ఎవరినైనా ఎదిరించి నిలువగల అసాధ్యుడు. నువ్వు వాడిని కూడ సంహరించితేనే నీ అవతారానికి పూర్ణత్వము సిద్ధించినట్లవుతుంది”. ఆకాశవాణి పలుకులను విన్న రాముడు దీర్ఘాలోచనలో పడి, చివరకు ఆ రాక్షస సంహారానికి అంజనేయుడే తగినవాడని నిర్ణయించి, హనుమను పిలిచి, “హనుమా! ఆకాశవాణి పలుకులను విన్నావు కదా! రావణ సంహార విషయంలో నీవెంతో సాయపడ్డావు. శతకంఠుని సంహార విషయం గురించి కాస్త ఆలోచించు, ఇందుకు నువ్వు సమర్థుడవు" అని ప్రేరేపించాడు.

శ్రీరామ ఆజ్ఞను తలదాల్చిన ఆంజనేయుడు శతకంఠుని సంహరించే కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే తన తోకను వేయి యోజనాల దూరానికి పెంచాడు. తన రూపాన్ని విపరీతంగా పెంచడంతో, సముద్రాలన్నీ కప్పి వేయబడి, భువి నుంచి దివికి దారి ఏర్పడటమేకాక, ఆకాశంలో నక్షత్రాలన్నీ హనుమంతుని శరీరంపై, దర్భలపై నీటిబిందువుల్లా గోచరించాయి. అప్పుడు ఆంజనేయునికి అంతరీక్షంలోగల శతకంఠుని నగరం కనబడింది. దాని ప్రాకారాలు భగభగమని మండే అగ్నిగోళాలవలె ఉన్నప్పటికీ, వాయునందనుడు దానిని పెకలించి సముద్రంలోకి విసిరేసాడు. శ్రీరామచంద్రుని సైన్యమంతా తన తోకపై నడిచేత్లు చేసి అంతరిక్షపురానికి చేరుకునేట్లు చేసాడు. అలా అందరూ శతకంఠుని నగరానికి చేరుకున్నారు. అప్పుడు శ్రీరామునికి, శతకంఠునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుని తలలను ఖంఢిస్తున్నప్పటికి, ఆ తలలు తిరిగి జనించసాగాయి. అప్పుడు ఆ రాక్షసుని రక్తపుబొట్లు నేలపై పడుతుండగా, వాటి నుంచి లెక్కకు మిక్కిలిగా శతకంఠులు ఉద్భవించసాగారు. వాతితో పోరాడిన శ్రీరాముడు విసికి వేసారిపోయాడు. ఆయన పరివారం నీరసించింది. అనేకులు మూర్చిల్లారు. అప్పుడు శ్రీరాముని చూసిన సీత భయపడింది. మార్గానంతరం తెలియక చింతించసాగింది.

సరిగ్గా అక్కడకు గర్గముని వచ్చాడు. ఆయన సీతను చూసి, హనుమంతుని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి భయాన్ని పోగొట్టాడు. సీతాదేవి ఆ మంత్రాన్ని నిష్టతో జపించగా, హనుమంతుడు శక్తియుక్తులతో పరిపూర్ణుడై విజృభించాడు. ఆంజనేయస్వామి పంచముఖం మూర్తియై వెలుగొందుతూ రాక్ష్సుని మాయాశక్తులను వీక్షిస్తూ, అతని కదలికలన్నింటిని అరికట్టేడు. ఆయన ప్రతి వదనంలో మూడేసి కళ్ళున్నాయి. దశ భుజాలలో దశ విధ ఆయుధాలను ధరించి ప్రళయకాల రుద్రుడై విహరించాడు. శతకంఠుడు పలువిధాలైన రూపాలను ధరించగా, ఆంజనేయుడు కూడ అన్ని రూపాలను ధరించాడు. సీతామాతను కూడ యుద్ధం చేయాల్సిందిగా ప్రార్థించాడు. ఆంజనేయుని అభ్యర్థనను విన్న సీతాదేవి పతిదేవుని తలచుకుని శక్తి స్వరూపిణియై, శక్తివంతమైన అస్త్రాన్ని సంధించింది. శతకంఠుడు స్త్రీ చేతిలో మరణించాల్సి ఉన్నందున, సీత వదిలిన దివ్యాస్త్ర ప్రభావానికి నేలకొరిగాడు. ఇదే పంచముఖాంజనేయస్వామి మహిమాన్విత గాథ.