అష్టాదశ శక్తి పీఠాలు….

అఖిల జగత్తుకు మూలదేవతగా జగన్మాతను ఆరాధించడం మన సంప్రదాయం. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి. ఒక్కొక్క రూపం ఒక్కో శక్తి కేంద్రమై ఈ విశ్వాన్ని కాపాడుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠాలతోపాటు అష్టోత్తర శత శక్తి పీఠాలతో భారతావని అణువణువూ మహా శక్తి కేంద్రమై విరాజిల్లుతోంది. ఈ శక్తి పీఠాలు ఆకారాది క్షకారాంత వర్ణమాలలోని ఒక్కో అక్షరానికి శక్తి స్థానమైన ప్రతీకలు. దీనివల్లే ప్రతి అక్షరం శక్తి సంపుటితమై మహా మంత్రమవుతోంది. శక్తి పీఠాలలో ప్రధానమైన అష్టాదశ పీఠాల ఆవిర్భావ విశేషాలు…

బ్రహ్మ సృష్టి ఆరంభంలో తొమ్మిది మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. ఆయన కుమార్తె సతి తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా శివుడిని వివాహమాడింది. దీంతో దక్షుడు శివద్వేషిగా మారాడు. శివుడిని అవమానించడం కోసం యజ్ఞం తలపెట్టాడు. అల్లుడు పరమేశ్వరుడు, కూతురు శక్తిని ఆహ్వానించకపోయినా స్త్రీ సహజమైన కుతూహలంతో ఆమె దక్షయజ్ఞానికి వెళ్ళింది. అక్కడ అవమానింపబడి యోగాగ్ని సృష్టించుకుని అందులో ఆహుతైంది. విషయం తెలిసిన శంకరుడు ఆగ్రహంతో శివ తాండవం చేశాడు. శివ జటాజూటం నుంచి వీరభద్రుడు ఆవిర్భవించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. పరమేశ్వరుడు దాక్షాయాణి మృతదేహాన్ని భుజంపై వేసుకుని విలయతాండవం చేయసాగాడు. బ్రహ్మాది దేవతలు భయంతో కంపించి విష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించారు. సతీదేవి శరీరం శంకరుడి భుజాన ఉన్నంత కాలం ఆయన రౌద్రం తగ్గదని భావించి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగల్ని ఖండఖండాలుగా చేశాడు.

సతీదేవి శరీర భాగాలు భారతదేశం అంతటా అక్కడక్కడా పడ్డాయి. ఆ శరీరం మొత్తం ఖండించడంతో పరమేశ్వరుడు క్రమంగా క్రోధం వదలి శాంత స్థితిలోకి చేరుకున్నాడు. ఆ ఖండాలు, ఆభరణాలు పడిన చోటల్లా ఒక శక్తి క్షేత్రంగా వెలసింది. అవే 108 శక్తి పీఠాలుగా గుర్తింపు పొందాయి. వాటిలో ప్రధానమైనవి పద్దెనిమిది శక్తి పీఠాలు.

శ్రీ శాంకరీదేవి – శ్రీలంక

ఇక్కడ సతీదేవి కాలి గజ్జెలు పడ్డాయి. శ్రీలంకలోని ట్రింకోమలిలో ఈ శక్తి పీఠం ఉంది. రావణాసురుడు శివభక్తుడు కావడం వల్ల పార్వతీదేవి లంకలో శ్రీ శాంకరీదేవిగా వెలసిందని ఐతిహ్యం.

శ్రీ కామాక్షీదేవి – కాంచీపురం

ఇక్కడ సతీదేవి వీపు భాగం పడింది. దేవతల విన్నపం మేరకు లోక కళ్యాణం కోసం దేవి బంధకాసురుడిని సంహరించి తన ఉగ్రరూపాన్ని మార్చుకుని కామాక్షిదేవిగా మారినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం తమిళనాడు రాజధాని చెన్నైకి 76 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ శృంఖలాదేవి – ప్రద్యుమ్నమ్

ఈ క్షేత్రంలో సతీదేవి ఉదరం పడింది. త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని సృష్టించినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం ప్రశ్చిమబంగలోని హుగ్లీ జిల్లా ప్రద్యుమ్నంలో ఉందీ. కోల్ కతాకు 135 కి.మీ. దూరంలో గల గంగాసాగర్ క్షేత్రం గొప్ప శక్తిపీఠంగా పేరొందింది.

శ్రీ చాముండేశ్వరి – మైసూరు

ఇక్కడ సతీదేవి తలా వెంట్రుకలు పడ్డాయి. త్రిమూర్తులు సహా సకల దేవతల అంశంతో వారివారి అస్త్రాలతో జన్మించి మహిషాసురుని వధించిన దేవియే శ్రీ చాముండేశ్వరి దేవి. ఈ శక్తి పీఠం కర్ణాటకలోని మైసూరు నగరానికి 13 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ జోగులాంబ – అలంపురం

సతీదేవి పైవరుస దంతాలు పడిన క్షేత్రమిది. ఈశ్వర ప్రసాది అయిన ఒక యువకుడు ఇక్కడ ఆలయ నిర్మాణం చేస్తుండగా ఆ ప్రాంత పాలకుడైన విలసద్రాజు ఆ యువకుడిని వధించాడు. ఫలితంగా రాజ్యం పోయి తిండిలేక సంచరిస్తున్న సమయంలో కనువిప్పు కలిగి జోగులాంబదేవి ఆలయం నిర్మించినట్లు పురాణ కథనం. ఈ శక్తి పీఠం మహబూబ్ నగర్ జిల్లాలో ఆలంపూర్ రైల్వే స్టేషన్ నుంచి 9 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ భ్రమరాంబదేవి – శ్రీశైలం

ఇక్కడ సతీదేవి మెడ భాగం పడింది. దేవతల, ఋషుల ప్రార్థనలకు మెచ్చి జగన్మాత ఝంకారం చేస్తూ ఉన్న భ్రమరాలతో వచ్చి అరుణాసురుని సంహరించింది. శ్రీ భ్రమరాంబాదేవిగా శ్రీశైలంలో కొలువుదీరినట్లు స్థల పురాణం. ఈ శక్తి పీఠం కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉంది. ఈ క్షేత్రం కర్నూలు నుంచి 179 కి.మీ., హైదరాబాద్ నుంచి 218 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ మహాలక్ష్మి – కొల్లాపూరి

ఈ క్షేత్రంలో సతీదేవి మూడు కళ్ళు పడ్డాయి. దేవతలందరూ మహాలక్ష్మిని ప్రార్థించగా వారి కోరిక మేరకు కాల్హుడిని సంహరించి ఈ క్షేత్రంలో కొలువైంది. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుంది అని ఆర్యోక్తి. ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ శక్తిపీఠం మహారాష్ట్రంలో ఉంది. ఈ శక్తి పీఠం హైదరాబాదుకు 540 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ ఏకవీరాదేవి – మహుర్వం

సతీదేవి కుడి చేయి ఈ ప్రాంతంలో పడింది. తండ్రి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తల్లి, సోదరుల తలలు నరికేశాడు. తల్లి శిరస్సు పడిన ప్రాంతమే ఈ క్షేత్రం. ఈ శక్తిపీఠం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి 42 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ మహాకాళి – ఉజ్జయిని

ఈ క్షేత్రంలో సతీదేవి పైపెదవి పడినట్లు చెబుతారు. త్రిపురాసురులను సంహరించడానికి శివుడు, పార్వతీదేవి మహాకాళిగా యుద్ధానికి సంసిద్ధమయ్యారు. పంచభూతాలు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడికి అస్త్రాలుగా సహాయపడ్డాయి. పరమేశ్వరుడు, మహాకాళి రాక్షసుణ్ణి సంహరించి విజయం సాధించిన ప్రాంతమే ఉజ్జయిని. ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉంది. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు 55 కి.మీ. దూరంలోని క్షిప్రానదీ తీరంలో వెలిసింది.

శ్రీ పురుహూతీకా దేవి – పిఠాపురం

ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడింది. గయాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి త్రిమూర్తులు గయుని దేహమే యజ్ఞానికి సరైన స్థలంగా భావించారు. ముని అజ్ఞానుసారం యజ్ఞం చేస్తూ పార్వతీదేవి సహాయంతో గయాసురుణ్ణి సంహరించిన ప్రాంతమే పిఠాపురం. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి 18 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ గిరిజాదేవి – ఒడిశా

ఇక్కడ సతీదేవి నాభి భాగం పడింది. లోకంలో శాంతి నశించి అశాంతిమయమైన సమయంలో లోకశాంతి కోసం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం నుంచి గిరిజా దేవి ఉద్భవించింది. లోకంలో శాంతిని ప్రసాదించేందుకు ఈ ప్రాంతంలో కొలువైనట్లు పురాణ కథనం. ఈ శక్తిపీఠం ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు 113 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ మాణిక్యాదేవి – ద్రాక్షారామం

ఈ క్షేత్రంలో సతీదేవి కణత భాగం పడింది. శివపార్వతుల తనయుడు కుమారస్వామి ఈ ప్రాంతంలోనే తారకాసురుణ్ణి సంహరించాడు. తారకాసురుడిలోని ఆత్మలింగం ముక్కలు కాగా ఏర్పడిన పంచారామాల్లో ఒకటి. ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 33 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ కామరూపాదేవి – హరిక్షేత్రం

ఈ క్షేత్రంలో సతీదేవి యోని భాగం పడింది. ఈ శక్తిపీఠం అసోం రాజధాని గౌహతికి 7 కి.మీ దూరంలో ఉంది. బ్రహ్మపుత్రానదీ తీరంలో ఈ క్షేత్రంలో ఏటా ఆషాడమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. కాముడికి మళ్ళీ రూపం వచ్చిన ప్రాంతం కాబట్టి కామాఖ్య క్షేత్రమని, కాపారూప క్షేత్రమని అంటారు. ఇక్కడి నీలాంచల పర్వతం విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి హరిక్షేత్రమని కూడా పిలుస్తారు.

శ్రీ మాధవేశ్వరి – ప్రయాగ

ఈ క్షేత్రంలో సతీదేవి చేతి ఉంగరం వేలు పడింది. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతం పంపకానికి శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారమే శక్తి స్వరూపిణిగా ఇక్కడ కొలువుదీరినట్లు స్థలపురాణం. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదుకు 6 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ వైష్ణవీ దేవి – జ్వాలా క్షేత్రం

సతీదేవి శిరస్సు పడింది ఈ క్షేత్రంలోనే. అమ్మ త్రిమూర్తి స్వరూపిణిగా కొలువుదీరిన క్షేత్రం జ్వాలాక్షేత్రం. అమ్మవారు ఇక్కడ వైష్ణవీదేవిగా దర్శనమిస్తుంది. ఈ శక్తిపీఠం కాశ్మీర్ లోని జమ్మూ నగరానికి 60 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ మాంగల్యాదేవి – గయ

ఇక్కడ సతీదేవి వక్షోజం పడినట్లు చెబుతారు. పిండప్రదానాలకు, పితృదేవతలకు పూజలకు పేరొందిన ప్రాంతమే గయా క్షేత్రం. ఫల్గుణీ, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమమైన ప్రయాగ క్షేత్రంలో సమానమై ఫలం అందిస్తోంది. ఈ శక్తిపీఠం బిహార్ రాజధాని పాట్నా నగరానికి 74 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ విశాలాక్షి – వారణాసి

ఇక్కడ సతీదేవి మణికర్ణిక పడింది. అమ్మలగన్నయమ్మ అశేష భక్తులపై తన కృపాకటాక్షాలు ప్రసరించే క్షేత్రమే వారణాసి. కాశీక్షేత్రం, వేద విద్యలకు నిలయం, అక్కడ నిరంతరం శిష్యగణంతో వ్యాసమహర్షి విశేశ్వర, అన్నపూర్ణాంబికలను ఆరాధించేవాడు. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉంది. ఇది అలహాబాద్ కు 131 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ సరస్వతీ దేవి – కాశ్మీర్

కపటంతో పార్వతీదేవి ఇంటిని సొంతం చేసుకున్న రావణాసురునిపై కోపగించుకున్న పార్వదేవిని బుజ్జగిస్తున్న సరస్వతిని ఇక్కడే కొలువై ఉండమని చెప్పిన ప్రాంతమే కాశ్మీర్ క్షేత్రం. ఈ క్షేత్రంలో సతీదేవి దక్షిణ హస్తం పడినట్లు చెబుతారు. ఈ శక్తిపీఠం కాశ్మీర్ లోని శ్రీనగర్ కు 10 కి.మీ. దూరంలో ఉంది.

అష్టాదశ శక్తిపీఠాలు దర్శించినా, స్మరించినా, జగములనేలే జగదంబ కరుణాకటాక్ష వీక్షణాలతో సకల శుభాలు కలిగి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు పొందుతారు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

వందమంది కౌరవులు వారి నామధేయములు…

1.దుర్యోధనుడు
2.దుశ్శాసనుడు
3.దుస్సహుడు
4.దుశ్శలుడు
5.జలసంధుడు
6. సముడు
7.సహుడు
8. విందుడు,
9.అనువిందుడు,
10.దుర్దర్షుడు,
11.సుబాహుడు,
12.దుష్పప్రదర్శనుడు,
13.దుర్మర్షణుడు,
14.దుర్ముఖుడు,
15.దుష్కర్ణుడు,
16. కర్ణుడు,
17. వివింశతుడు,
18.వికర్ణుడు,
19. శలుడు
20.సత్వుడు,
21.సులోచనుడు,
22.చిత్రుడు,
23.ఉపచిత్రుడు,
24.చిత్రాక్షుడు,
25.చారుచిత్రుడు,
26.శరాసనుడు,
27.దుర్మధుడు,
28.దుర్విగాహుడు,
29.వివిత్సుడు,
30.వికటాననుడు,
31.నోర్ణనాభుడు,
32.సునాభుడు,
33.నందుడు,
34.ఉపనందుడు,
35.చిత్రాణుడు,
36.చిత్రవర్మ,
37.సువర్మ,
38.దుర్విమోచనుడు,
39.అయోబాహుడు,
40.మహాబాహుడు,
41.చిత్రాంగుడు,
42.చిత్రకుండలుడు,
43.భీమవేగుడు,
44.భీమలుడు,
45.బలాకుడు,
46.బలవర్ధనుడు,
47.నోగ్రాయుధుడు,
48.సుషేణుడు,
49.కుండధారుడు,
50.మహోదరుడు,
51.చిత్రాయుధుడు,
52.నిషింగుడు,
53.పాశుడు,
54.బృందారకుడు,
55.దృఢవర్మ,
56.దృఢక్షత్రుడు,
57.సోమకీర్తి,
58.అనూదరుడు,
59.దృఢసంధుడు,
60.జరాసంధుడు,
61.సదుడు,
62.సువాగుడు,
63.ఉగ్రశ్రవుడు,
64.ఉగ్రసేనుడు,
65.సేనాని
66.దుష్పరాజుడు,
67.అపరాజితుడు,
68.కుండశాయి,
69.విశాలాక్షుడు,
70.దురాధరుడు,
71.దుర్జయుడు,
72.దృఢహస్థుడు,
73.సుహస్తుడు,
74.వాయువేగుడు,
75.సువర్చుడు,
76.ఆదిత్యకేతుడు,
77.బహ్వాశి,
78.నాగదత్తుడు,
79.అగ్రయాయుడు,
80.కవచుడు,
81.క్రధనుడు,
82.కుండినుడు,
83.ధనుర్ధరోగుడు,
84.భీమరధుడు,
85.వీరబాహుడు,
86.వలోలుడు,
87.రుద్రకర్ముడు
88.దృఢరదాశ్రుడు,
89.అదృష్యుడు,
90.కుండభేది,
91.విరావి,
92.ప్రమధుడు,
93.ప్రమాధి,
94.దీర్గరోముడు,
95.దీర్గబాహువు,
96.ఊడోరుడు,
97.కనకద్వజుడు,
98.ఉపాభయుడు,
99.కుండాశి,
100.విరజనుడు.
@నూట ఒకటవ కుండనుండి
దుశ్శల అనే ఆడపిల్ల జన్మించింది.

ఆధ్యాత్మిక జీవనం

వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమిగా పేరు పొందిన భరతభూమి, భారతీయ సంస్కృతి, నాగరికతలు ఎంతో ఉత్కృష్టమైనటువంటివి. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు మన సంస్కృతీ నాగారికతల ఔన్నత్యాన్ని గుర్తించి ప్రశంసించినవే!

ఈ ప్రకృతి, అందులోని చరాచారాలన్నింటిలోనూ దైవాన్ని దర్శించగలగడం, పూజించడం మన ప్రత్యేకత. అంతేకాకుండా మనం పాటించే ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాలు, మనం జరుపుకునే పండుగలు, పర్వదినాలు అన్నింటిలోనూ ఎన్నో ఉత్తమమైన విషయాలు దాగున్నాయి. ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అంతేకాదు, ప్రతిరోజూ నిద్రలేవడం నుంచి తిరిగి రాత్రి నిద్రకు ఉపక్రమించేంత వరకూ పాటించాల్సిన నియమాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ధర్మశాస్త్రాలు, పురాణాల్లో పేర్కొనబడ్డాయి.

వీటన్నింటినీ ఆచరించడం వల్ల మానసిక ప్రాశాంతత కలుగుతుంది. మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి దూరమై, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రాచీనకాలంనుంచీ వస్తున్న సాంప్రదాయాన్ని గమనిస్తే, తెల్ల వారుఝామునే నిద్రలేవడం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. ఈ కాలాన్ని ‘బ్రాహ్మీముహూర్తం’ అని అంటారు. సూర్యుడు ఉదయించడానికి సుమారు ఒకటిన్నర గంట ముందు ఉండే కాలాన్నీ బ్రాహ్మీముహూర్తం అని చెప్పవచ్చు. అంటే సుమారు నాలుగు – నాలుగున్నర గంటల మధ్యకాలం. ఈ కాలంలో ప్రతిదినం నిద్రలేవడం అనేది మంచిది. నిత్య జీవితంలో అనుసరించాల్సిన నియమాల్లో ఇది ప్రధానమైనది. బ్రాహ్మీముహూర్త సమయంలో నిద్రించడంవల్ల పుణ్యఫలాలన్నీ నశిస్తాయి అని చెప్పబడుతోంది.

నిద్రలేస్తున్న సమయంలో భగవంతుని స్మరించుకోవడం మంచిది. నిద్రలేచి కూర్చుండగానే “కర్మదర్శనం” చేయాలని శాస్త్రవచనం. అంటే కుడిచేతిని చూసుకోవాలి. చూస్తూ –

“కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కర వృష్టే చ గోవిందః ప్రాతే కరదర్శనమ్”

అనే శ్లోకాన్ని పఠించాలి.

అంటే, అరచేతి చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చేతి మొదట్లో శ్రీమహావిష్ణవు ఉంటారని భావం. నిద్రలేస్తూనే అరచేతిని దర్శిస్తూ, పై శ్లోకాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి, సరస్వతి, శ్రీమహావిష్ణువులను దర్శించినట్లు లెక్క. అంతేకాకుండా నిద్ర లేచే సమయంలో కుడివైపు నుంచి నిద్ర లేవడం శ్రేష్ఠం.

ఈ విధంగా నిద్రలేచి, పడకమీద కూర్చుని చేతిని చూసుకున్న అనంతరం దైవప్రార్ధన చేయడం ముఖ్యం. అంటే, ఎవరికీ ఇష్టమైన దేవతలను వారుస్మరించుకుంటూ, వారిని స్తుతిస్తూ గుర్తున్న శ్లోకాలను మననం చేసుకోవడం మంచది. అంతే కాకుండా, గతంలో దర్శించినటువంటి పుణ్యక్షేత్రాలను గుర్తుకు తెచ్చుకుని, కళ్ళు మూసుకుని వాటిని దర్శించినట్లు ఊహించుకుంటూ, వాటిని కళ్ళముందు సాక్షాత్కరింపజేసుకుని ప్రార్థించవచ్చు.

ఈ విధంగా ఉదయాన్నే దైవస్మరణ చేయడం వల్ల ఆ రోజంతా మానసిక ప్రశాంతతను పొందడంలో పాటూ పుణ్యఫలాలను కూడా పొందవచ్చు.

తర్వాత భూమిపైన కాళ్ళుమోపుతూ –

“సముద్రవసనేదేవి పర్వతస్తమండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే” అనే శ్లోకాన్ని పఠిస్తూ భూదేవికి నమస్కరించాలి. అంటే – “సముద్రము వాస్తంగా కలిగి, పర్వతాలను స్తనములుగా కలిగిన శ్రీమహావిష్ణువు భార్య అయినా ఓ భూదేవి! నీకు నమస్కరిస్తున్నాను. నా కాళ్ళు నీకు తగులుతున్నందుకు నన్ను క్షమించు” అని అర్థం.

పంచభూతములైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలన్నీ మనకు దైవంతో సమానం. తొలిరోజుల నుంచి వీటిని పూజించడం జరుగుతోంది. వాటిల్లో భూమి ఒకటి. ఈ భూమిని భూదేవిగా భావిస్తాం. భూదేవి శ్రీమహావిష్ణువు యొక్క సతీమణి. నిత్యం మన భారాన్ని మోస్తున్న మహాతల్లి. ప్రతిదినం ప్రాతఃకాలాన భూమిపైన కాలు మోపుతూ, ఆ చల్లని తల్లిని ప్రార్థించడంవల్ల, భూదేవి ఆశీస్సులతో పాటూ శ్రీమన్నారాయణుడి కరుణాకటాక్షాలు కూడా లభిస్తాయి.

నిద్రలేస్తూ ముఖం కడుక్కుని మంచినీళ్లు సేవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కనీసం సుమారు ఒక లీటరు మంచినీరు తాగడం ఆరోగ్యదాయకమని ఆయుర్వేదం కూడా చెబుతోంది. నీటిని సేవించడం అనేది మలమూత్రాదుల విసర్జనకు, ‘పళ్ళుతోముకోవడాని కంటే ముందే చేయాలి. అది కూడా ముందురోజు రాత్రి రాగిచెంబులో నీరు పోసి ఉంచి, మారునాటి ఉదయమే సేవించడం శ్రేష్టం. లేదంటే మట్టికుండలోని నీరుసేవించాలి. ఈ విధంగా నీటిని సేవించిన అనంతరమే మాలమూత్ర విసర్జనలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ప్రతిదినం నిద్రలేవగానే, పళ్ళు కూడాతోమకుండా నీరు త్రాగడం వల్ల చాలా అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేదశాస్రం చెబుతోంది. అంతేకాకుండా, నేటి ఆధునిక వైద్యులు, శాస్త్రజ్ఞులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. అనంతరం స్నానంచేయాలి. ఈ స్నానవిధికి సంబంధించి మన సాంప్రదాయాలు అనేక నిబంధనలను ఏర్పాటుచేశాయి. ప్రతిదినం వేకువఝామునే స్నానం చేయాలనేది శాస్త్రవచనం. స్నానం చేసే సమయంలో “సంకల్పం” చెప్పుకోవాలని నిబంధన. (పూజలు, వ్రతాలు వంటివి చేసే సమయంలో ఏ విధంగా ఆస్మిన్ వంమాన వ్యావహారిక చాంద్రమానేన….అని చెప్పుకున్నట్లు) ప్రతిదినం చల్లని నీటిలో స్నానమాచరించాలి. అభ్యంగనస్నానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే తలస్నానం నిత్యం ఆచరించవలెనని. స్నానం చేసే సమయంలో పూర్తిగా బట్టలు విప్పి నగ్నంగా స్నానంచేయరాదు. నగ్నంగా స్నానం చేస్తే నరకబాధలు అనేకం అనుభవించాల్సి వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఉపవాసం ఉండే రోజుల్లో, పితృకర్మలు చేయు రోజుల్లో , అంటే ఆబ్దికం వంటివి జరిపంచే రోజుల్లో, తర్పణాలు, పిండప్రదానాలు చేసే రోజుల్లో తలంటుకుని స్నానం చేయరాదు. ఇంకా సంక్రమణ దినాలు, తదియ, సప్తమి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఉన్న రోజుల్లోనూ, ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తలంటుకుని స్నానం చేయరాదు. మిగతా రోజుల్లో చేయవచ్చు. ఈ దినాల్లో తలంటుకుని మాములుగా తలస్నానాలు ఆచరించవచ్చు. అలాగే కార్తీక, మాఘ, వైశాఖ మాసాల్లో కూడా తలంటుస్నానం చేయరాదని శాస్త్రవచనం.

“గుణాదశ స్నాన పరస్యసాధో
రూపంచ పుష్టిశ్చ బలంచ తేజః
ఆరోగ్య మాయుశ్చ మనోసురుద్ వ
దు: స్వప్న ఘాతశ్చ తవశ్చ మేధా” అని దక్షస్మృతిలో చెప్పబడింది. అంటే – స్నానం వలన రూపం, పుష్ఠి, బలము, తేజస్సు, ఆరోగ్యం, దీర్ఘఆయుర్ధాయం, చిత్తప్రసన్నత, దుఃస్వప్న నాశనము, తపస్సు, గ్రంథాధారణ చేసేందుకు తగిన బుద్ధి, శక్తి అనే పది ప్రత్యక్ష లాభాలు కలుగుతాయని అర్థం.

అట్లే విష్ణుస్మృతిలో –

అజ్ఞానాద్యాది వా మోహద్రాత్రే
యుద్దరితం కృతమ్
ప్రాతః స్నానానికి తత్సర్వం
శోధయంది ద్విజోత్తమా!! అని పేర్కొనబడింది. అంటే, అజ్ఞానం వలనగానీ, మొహం వలనగానీ, రాత్రులందు చేసే పాపకార్యాలవలన శరీరదోషాలు ప్రాప్తిస్తాయి. ప్రాతః స్నానంతో ఆ దోషాలు తొలగిపోతాయి అని అర్థం.

అంతటి పవిత్రమైన స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని పఠించవలెను.

తీక్షణదంష్ట్ర! మహాకాయ!కల్పాందత దహనోపమ!
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్వసి
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధిం కురు
గంగా గంగేతి యోబ్రూయాత్ యోజయానాం శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి
యో సా సర్వగతో విష్ణుః చిత్ స్వరూపీ నిరంజనః
న ఏవ ద్రరూపేణగంగాంభో నాత్రా సంశయః

అనే శ్లోకాన్ని పఠించడం శ్రేష్ఠం.

లేదంటే కనీసం –

“గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధిం కురు” అనే శ్లోకాన్నైనా పఠించి స్నానం చేయడం మంచిది.

స్నానానంతరం “విభూతి” ని, కుంకుమను, గంధములను నుదుట ధరించాలని భారతీయ సాంప్రదాయం.

“భూతిర్ధూతికరీ పవిత్ర జననీ పాపౌఘవిధ్వంసివే
సర్వోపద్ర నవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ
భూత ప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణీ
తేజోరాజ్యవిశేష మొక్షణకరీ భూతిం పదా ధార్యతాం!!” అని చెప్పబడింది.

విభూతి సంపదలను ప్రసాదిస్తుంది. పవిత్రతను కలిగిస్తుంది. పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది. సర్వ అరిష్టాలను తొలగించి సకలశుభాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. గ్రహాబాధలు, భూతప్రేతపిశాచాది బాధలను దూరం చేసి తేజస్సును ప్రసాదిస్తుంది. ముక్తిని చేకూరుస్తుందని చెప్పబడింది. విభూతిని ధరించే సమయంలో ఈ క్రింది శ్లోకాలను పఠించాలి.

“త్రాయుషం జమదగ్నేః
కశ్యపశ్య త్రాయుషమ్
యద్దేవేషు త్ర్యాయుషమ్
తన్నోస్తు త్రాయుషమ్”

అంటే జమదగ్ని, కశ్యపుడు దేవదేవుల యొక్క ఆయుర్దాయం కంటే మూడురెట్లు ఆయుర్దాయం కలుగుగాక అని అర్థం.

“శ్రీకరంచ పవిత్రంచ
శోకరోగ నివారణ
లోకే వశీకరణం పుంసాం
భస్మం త్రైలోక్యపావనమ్”

ముల్లోకాలను పావనం చేసే మంగళప్రదమైన భస్మధారణంతో సకల రోగాలు, పాపాలు, సకల శోకాలు నిర్మూలనం కాగవలని అర్థం.

అలాగే, గంధం ధరించే సమయంలో –

“శంఖ చక్ర గదాపాణే
ద్వారకానిలయాచ్యుత
గోవింద పుండరీకాక్ష
రక్షమాం శరణాగతిమ్!!”

అనే శ్లోకాన్ని పఠించాలి.

కుంకుమను ధరించే సమయంలో –

ఓంకార పంజర శుకీం
ఉపనిషాదుద్యాన కేళికలకంఠీమ్!
ఆగమ విపిన మయూరీ
మార్యా మంతర్విభావయే గౌరీం!!

అనే శ్లోకాన్ని పఠించడం శ్రేష్టం.

స్నానంతరం ఈ విధంగా విభూతి, కుంకుమ గంధాలను ధరించిన తరువాత, ఇష్టదేవతా పూజను, అర్చనలు చేయాలి. అంతేకాకుండా, ఈ చరాచరజగత్తుకు వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దేవుడైన సూర్యునికి నమస్కరించుకోవాలి.

“జపాకుసుమ సంకాశం
కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరీమ్ సర్వపాపఘ్నం
ప్రణతోస్మి దివాకరమ్!!”

ఎర్రనిపువ్వులు, ఎరుపు రంగు ప్రతీకారమైన కశ్యపుని సంతానమైన దివాకారునికి నామస్కరిస్తున్నాను. నా పాపాలను పటాపంచలు చేసి, నన్ను రక్షించగలవంటూ సూర్యునికి నమస్కరించవలెను. ఈ శ్లోకమే కాకుండా…

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర!! దివాకర్ నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే!!

అనే శ్లోకాన్ని పఠించి అయినా నమస్కరించవచ్చు. అనంతరం, తులసి వృక్షం వద్ద దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణలు చేసి ఈ క్రింది శ్లోకంతో నామస్కరించడం మంచిది.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహామ్
నమస్తులసీ కళ్యాణీ నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయని

అని పఠిస్తూ నమస్కరించాలి.

అలాగే, శమీవృక్షం, రావిచెట్టు, వేపచెట్టు వంటి దేవతావృక్షాలు, ఇంటి పెరట్లోగాని, చుట్టుప్రక్కలాగాని ఉన్నట్లయితే, వాటికి కూడా నమస్కరించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం చేసే ముందు, భోజనం చేసే సమయంలోనూ కొన్ని నిబంధనలను పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భోజనానికి తూర్పు ముఖం గానూ, లేదంటే దక్షిణ ముఖంగాను కూర్చుని భుజించడం మంచిది. తూర్పుముఖంగా కూర్చుని భుజిస్తే ఆయుష్షు, దక్షిణముఖంగా కూర్చుని భుజిస్తే యశస్సు కలుగుతాయని చెప్పబడుతోంది. భోజనానికి కూర్చునే ముందు, కాళ్ళు, చేతులు, నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. బిగుతుగా ఉండే దుస్తులను ధరించారాదు. తలపైన టోపీ వంటివి ధరించారాదు. నెలపైన పద్మాసనస్థితిలో కూర్చుని భుజించడం మంచిది. భోజనానికి ముందు ఈ క్రింది నియమాలను పాటించాలి.

భోజన పదార్థములన్నీ విస్తారాకులోగానీ, పళ్ళేలలోగాని వడ్డించిన అనంతరం, నీటిని కుడిచేతిలోనికి తీసుకుని, గాయత్రీ మంత్రాన్ని జపించి, ఆ నీటిని తినబోవు భోజనంపై చల్లాలి. అనంతరం మళ్ళీ చేతిలోకి నీరు తీసుకుని –

“సత్యం త్వరైన పరిషించామి” – అని అంటూ కుడిచేతిని ఎడమవైపు నుంచి కుడిచేతివరకు ప్రదక్షిణగా విస్తరించుట్టూ ఆ నీరు విడువవలెను.

అదే రాత్రిపూట భోజనం చేసే సమయంలో –

“ఋతంత్వా సత్యేవ పరిషించామి” అని అంటూ నీటినిం విడువవలెను. అనంతరం ఐదుసార్లు ఎన్నో కొద్దీ కొద్దిగా తీసుకుని –

“ఓం ఉదావాయస్వాహా, ఓం ఆపావాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయస్వాహా, ఓం సమానాయ స్వాహా” అనే మంత్రాలను పఠిస్తూ నోట్లో వేసుకుని నమలకుండా మింగాలి.

ఈ విధంగా చేయలేనివారు, కనీసం భోజన సమయంలో ఈ క్రింది శ్లోకాలనైనా పఠించాలి.

“త్వదీయం వాస్తు గోవిందా
తుభ్యంఎవ సమర్పయామి!
గృహానికి సముఖోభూత్వా
ప్రసీత పరమేశ్వరం||”

ఓ గోవిందా! నీ వస్తువును నీకే అర్పిస్తున్నానుశీ నీవు నాయందు ప్రసన్నుడవై, ప్రసన్నముఖంతో దీనిని గ్రహించు అని అర్థం.

“బ్రహ్మర్పణం బ్రహ్మహవిః
బ్రహ్మగ్నే బ్రహ్మణా హుతమ్!
బ్రహ్మైవ తేన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధినా||

ఆహారాన్ని భుజించే ముందు, నివేదన చేసిన అనంతరం, పైశ్లోకాన్ని పఠించిన అనంతరం, భుజించాలి. అంతేకాకుండా –

“అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాందేహ మాశ్రితః| ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమ్||”

నేను జఠరాగ్ని రూపంగామారి, ప్రాణుల శరీరాలను ఆశ్రయించి, ప్రాణా పానములతో కూడినవాడినై, నాలుగు రకాలైన అన్నాన్ని పచనం చేస్తున్నానని చెప్పి భుజించడం మంచిది. భోజనం చేయడం ముగించిన అనంతరం –

అమృతాపి ధానమాసి రౌరవే ఆపుణ్యానిలయే పద్మార్డుద| నివాసినామ్ ఆర్థినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్టతు” అని శ్లోకాన్ని పలుకుతూ నీటిని అప్రదక్షిణంగా విస్తరిచుట్టూ తిప్పాలి.

భోజనం చేయడం ముగించి లేచిన అనంతరం చేతులు, కాళ్ళను కడుక్కోవాలి. నోట్లో నీటిని పోసుకుని పుక్కిలించాలి. అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి.

“ఆగస్త్యం వైనతేయఇపశ్చ
శవఞ్చ బడబానలమ్
ఆహార పరిపాకార్థం స్మరే
ద్దీమఞ్చ పఞ్చమమ్”

అగస్త్యుడు, గరుత్మంతుడు, శనీశ్వరుడు, బడబానలుడు భీములను స్మరించడం వాళ్ళ ఆహారం సమంగా జీర్ణం కాగలదని అర్థం. అలాగే పిల్లలకు ఆహారం పెట్టిన అనంతరం –

“జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అని పొట్టను రుద్దాలి.

పెద్దలు కూడా పొట్టపైన చేతిని ఉంచి రుద్దుకుంటూ ఈ శ్లోకాన్ని పఠించవచ్చు.

సాధారణంగా సాయంత్రం సూర్యాస్తమయం అవుతూనే ఇంటిముందు లైట్లు వేయడం, దీపాన్ని వెలిగించడం ఆచారం. లైట్లు వేయగానే దేవుడి పటంవైపు చూసి నమస్కరిస్తుంటాం. అంతేకాకుండా, దీపాన్ని వెలిగించాక గానీ, లైట్లు వేశాక గానీ –

“దీపంజ్యోతి పరబ్రహ్మః
దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వమ్
సంధ్యాదీప నమోస్తుతే!!

అనే శ్లోకాన్ని పఠించాలి.

అంతేకాకుండా,

“దీపంజ్యోతి పరబ్రహ్మః
దీపం జ్యోతి జనార్ధన
దీపేన హారతే పాపం
సంధ్యాదీప నమోస్తుతే!!”

“దీపమే పరబ్రహ్మ, దీపమే జనార్ధనుడు. సకల పాపాలను హరింపజేస్తుంది – దీపం. అటువంటి సంధ్యాదీపానికి నామస్కరిస్తున్నాను” అని దీపానికి నమస్కరించాలి.

అలాగే, సాయంత్రం లక్ష్మీదేవిని, ఇషా దేవతలను పూజించవచ్చు.

తులసికోట వద్ద దీపాలను వెలిగించి, ప్రదక్షిణం చేసి నమస్కరించవచ్చు. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించేముందు లేదా లైటు వేసే సమయంలో ఇంటి ప్రధాన వాకిలిని తెరచి ఉంచాలి. పెరటివైపునున్న వాకిలిని మూసి ఉంచాలి.

“యదాతు మానసిక్లాంతే కర్మాత్మానః క్లామాన్వితాః!! విషయేభ్యో నివర్తంతే తదాస్వపితి మానవః!!”

అని చరకసంహితలో పేర్కొనబడింది. మనస్సు అలసట చెందినటువంటి స్థితిలో ఇంద్రియాలన్నీ తమ తమ కర్తవ్యాలను మన మనస్సునకే కైవసం అవ్వడంవల్ల శారీరక మానసిక పనులు చేయలేక విశ్రాంతిని కోరుతాయి. అదే నిద్రావస్థ.

ప్రతిమనిషి కనీసం ఆరుగంటలు నిద్రించాలని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. నిద్రించే ముందు కొన్ని నియమాలను పాటించాలి.

నిద్రించే సమయంలో తడికాళ్ళతో పడుకోరాదు. తడికాళ్ళతో పడుకుని నిద్రిస్తే ఆయుష్షు క్షీణిస్తుంది అని శాస్త్రవచనం. తూర్పువైపుగానీ, దక్షిణంవైపు గానీ తల ఉంచి పడుకుని నిద్రించాలి.

ఇతరుల ఇంట్లో పడుకునే సమయంలో పడమర వైపు తల ఉంచి నిద్రించాలి.

ఎప్పటికీ ఉత్తరంవైపున తలఉంచి పడుకుని నిద్రించరాదు. ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యరీత్యా మంచిదని చెప్పబడుతోంది.

నిద్రలేచే సమయంలో కుడివైపు నుంచి నిద్ర లేవాలి.

నిద్రపోవడానికి ముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.

“కరచరణకృతం వా కర్మా వాక్కా యజం వా
శ్రవణ సయసజంవా మానసంవా ప రాధామ్
విహిత మావిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివశివ కారుణాబ్దే హి మహాదేవ శంభో”

“చేతులతోగానీ, కాళ్లతోగానీ, మాటలవల్లగానీ, చేతలవల్లగానీ, శరీరంచేతగానీ, చెవులతోగానీ, కళ్ళతోగానీ, మనస్సుతోగానీ, తెలిసిగానీ, తెలియకగానీ, చేసిన నా సర్వ అపరాధాలను కారుణామయుడవైన ఓ శివుడా క్షమించు” అని ప్రార్థించి నిద్రించాలి.

బ్రాహ్మిముహూర్తంలో నిద్రలేచినప్పటి\నుంచి రాత్రి నిద్రించే వరకు, ఈ విధంగా విధులను ఆచరించడంవల్ల జీవితం సుఖవంతమవుతుంది.

అంతేకాకుండా, ఇంకా వివిధ సమయాల్లో వివిధ శ్లోకాలను పఠించడంవల్ల అనేక సత్ఫలితాలు లభిస్తాయి.

నిద్రించే సమయంలో స్వప్నాలు వచ్చినా…. చెడుకలలు రాకుండా ఉండేందుకు –

“రామం స్కంధం హనుమంతం
వైనతేయం వృకోదరం
శయనేయః పఠేనిత్యం
దుస్స్వప్నం తస్యనశ్యతి” అనే శ్లోకాన్ని పఠించాలి. ఉరుముతున్నప్పుడు, పిడుగులు పడుతున్న సమయంలో అర్జునునిని స్తుతించాలని పురాణకథనం.

అర్జున ఫల్గుణః పార్థః
కిరిటీ శ్వేత వాహనః
బీభత్సో విజయః కృష్ణః
సవ్యసాచీ ధనుంజయః అనే శ్లోకాన్ని పఠించాలి. ఆనారోగ్యంవల్ల ఏమైనా మందులు వేసుకునే సమయంలొ ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.

“ధన్వంత్రిణం గరుత్మంతం – ఫణిరాజంత చ కౌస్తుభం|
ఆచ్యుతం చామృతం చంద్రం – స్మరేత్ ఔషధ కర్మణీ|
శరీరే జర్ఘరీ భూతే – వ్యాధిగ్రస్తే కళేబరే|
ఔషధం జాహ్నవీతోయం -వైద్యోనారాయణోహరిః||” ప్రతినెలా అమావాస్య తర్వాత వచ్చే క్రొత్తనెలలో చంద్రుదు ఉదయిస్తాడు. ఉదయిస్తున్న చంద్రబింబాన్ని నెలబాలుడు అని పిలుస్తారు. సాధారణంగా నెలబాలుని ఆకాశంలో చూస్తూనే, దేవుడి ఫోటోను గానీ ఇష్టమైనవారి ముఖాన్నిగానీ చూస్తుంటారు. అంతేకాకుండా, నూలు పోగును తీసి చంద్రుని వైపు వేస్తుంటారు.

అలాగే నెలబాలుని దర్శిస్తూనే ఈ క్రింది శ్లొకాన్ని పఠించడం మంచిది.

“క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర
హిరణ్మకుట వాసాయా బాలచంద్ర నమొస్తుతే||”

అలాగే, ఇంటినుంచి బయటకు వెళ్ళేముందు –
“యశ్శివో సమారూపాభ్యాం యా దేవి సర్వమంగళా
తయో సంస్మరణాతే పుంసాం సర్వతో జయమంగళం
లాభాస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవే
యేషామిందీవర్శ్యామే హృదయాస్థో జ్ఞార్ధనః” అనే శ్లోకాన్ని పఠించడం మంచిది.

తెలుగు విజ్ఞానర్వస్వం…

త్రిగుణములు

– సత్వ గుణము, రజో గుణము, తమో గుణము

త్రిమతాచార్యులు

– శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు

పురుషార్థములు

– ధర్మ, అర్థ, కామ, మోక్ష

చతుర్వేదములు

– ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము

యుగములు

– కృతయుగం – 17,28,000 సంవత్సరాలు

– త్రేతాయుగం – 12,96,000 సంవత్సరాలు

– ద్వాపర యుగం – 8,64,000 సంవత్సరాలు

– కలి యుగం – 4,32,000 సంవత్సరాలు

పంచాకావ్యములు

-రఘు వంశము, కుమారా సంభవము, మేఘసందేశము, భార, మాఘము

పంచామృతములు

– నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేన

పంచాంగములు

– తిధి, వారము, నక్షత్రము, యోగం, కర్ణం

షడ్రసములు

– ఉప్పు, పులుపు, కారము, తీపి, చేదు, వగరు

సప్త మహా ఋషులు

– కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్టుడు, జమదగ్ని

సప్త సముద్రములు

– లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సుర సముద్రము, సర్పి సముద్రము, దధి సముద్రము, క్షీర సముద్రము, జల సముద్రము

సప్త పై లోకములు

– భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనర్లోకం, తపోలోకం, సత్యలోకం

సప్త క్రింది లోకములు

– అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము

అష్ట దిక్పాలకులు

– ఇంద్రుడు, అగ్ని, యముడు, విబుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈసనుడు

అష్ట లక్ష్ములు

– ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, విజయ లక్ష్మి, ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, గజ లక్ష్మి, ఆది లక్ష్మి, విద్యా లక్ష్మి

అష్టాంగ యోగ

– ఆసనాలు, యమ, నియమ, ప్రణయమ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి

నవబ్రహ్మలు

– మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్టుడు, వాసుదేవుడు

నవ రసములు

– శృంగారము, హాస్యము, కరుణము, రౌద్రము, వీరము, భయానకము, భీభత్సము, అద్భుతము, శాంతము

నవరత్నములు

– వజ్రము, వైఢూర్యము, గోమేధికము, పుష్ప రాగము, పచ్చ, కెంపు, నీలము, పవాలము, ముత్యము

నవదాన్యములు

– వడ్లు, ఉలవలు, పెసలు, మినుములు, నువ్వులు, గోధుమలు, అనుములు, కందులు, సెనగలు

అష్టాదశ పురాణాలు

– మత్స పురాణం, భాగవత పురాణం, భ్రంహాండ  పురాణం, బ్రహ్మ పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, నారద పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, మార్కండేయ పురాణం, భవిష్యత్తు పురాణం, బ్రహ్మ వైవార్త పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, స్కంద పురాణం

విగ్రహారాధన–కారణం…

ఉపాసనలో విగ్రహారాధన ఐదవ వర్గంలోకి వస్తుంది. మనసు చంచలమైనది. ప్రతిక్షణం పరిభ్రవిస్తూ ఉంటుంది. దానిని నియంత్రించి ఏకాగ్రత సాధించటానికి మార్గం విగ్రహారాధన. వైదికకాలం నుండి విగ్రహారాధనకు ప్రాధాన్యత ఉంది.

మనోధృతిర్ధారణా స్యాత్ సమాధిర్బ్రహ్మాణి స్థితిః|
అమూర్తో చేత్ స్థిరా న స్వాత్ తో మూర్తి విచింతయేత్||

మనస్సు యొక్క ధృతి (స్థిరత్వం) ధారణ అనబడుతుంది. బ్రహ్మలో స్థతి పొందటం సమాధి అవుతుంది. కాని, మనసు స్థిరంగా ఉండకపోతే ఆలంబనగా విగ్రహాన్ని గ్రహించటం అవసమౌతుంది. జ్ఞాని స్థితిని పొందటానికి సాధకుడు మొదట స్థిరత్వం సాధించాలి. అది విగ్రహారాధన వల్లనే సాధ్యమౌతుంది. దానివల్ల మనసుకు ఏకాగ్రత లభిస్తుంది. మనస్సులో భావం ఉత్పన్నం కావటానికి ఒక చిత్రపటం లేదా ప్రతిమ అవసరమన్న అంశాన్ని శాస్త్రీయంగా కూడా వైజ్ఞానికులు అంగీకరించారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చేతిలో తన తల్లి, సోదరి, భార్య చిత్రపటాలు ఉన్నాయనుకుందాం. తల్లి చిత్రం చూడగానే అతనిలో ఆమె వాత్సల్యం; సోదరి చిత్రం చూడగానే స్నేహం, ఆర్ద్రత,భార్య చిత్రం చూడగానే ప్రణయభావం జాగృతం కావటం సహజం.

ఏకలవ్యుడు ఏమి చేశాడు? ధనుర్విద్య అభ్యసించటానికి ద్రోణాచార్యుని ప్రతిమను భక్తీభావంతో పూజించి ఆ ప్రతిమలో గురువును భావన చేసి, ధనుర్విద్యలో అర్జునుని మించిన విలుకాడుగా ఎదిగాడు. ధ్రువుడు నారదుని ఉపదేశంతో శ్రీమన్నారాయణుని మూర్తిని నిర్మించి, దానిపై మనసు నిలిపి ఆరుమాసాల్లో భవత్సాక్షాత్కారం పొందాడు. కేవలం సనాతన హిందూధర్మంలోనే కాక ఇతర అనేక మతాల్లోనూ విగ్రహారాధన ఉంది. క్రైస్తవులు శిలువను పూజిస్తారు. ముసల్మానులు మక్కాలో ‘సంగే అసబద్’ ను చుంబిస్తారు. సమాధులపై పూలు చల్లుతారు. సిక్కులు గురు గ్రంథసాహెబ్ను భక్తితో ఆరాధిస్తారు.

నిర్గుణ, నిరాకార పరబ్రహ్మను ధ్యానించగలిగే స్థితిని చేరేవరకు సగుణమూర్తిని ఉపాసించటం సముచిత విధానమే.

జ్యోతిర్విజ్ఞానం…

‘జ్యోతి’ పదం నుండి ‘జ్యోతిషం’ ఆవిర్భవించింది. ‘జ్యోతి’ అంటే ప్రకాశం, వెలుగు అర్థం. జ్యోతిషం ఒక వైజ్ఞానిక శాస్త్రం.

జ్యోతిషాం సూర్యాదిగ్రహాణాం బోధకం శాస్త్రం!

సూర్యాది గ్రహాలూ, కాలం గురించి తెలిపే శాస్రమే జ్యోతిషం.

గగనమండలంలోని ప్రధానగ్రహాలు, నక్షత్రాలు భూమిపై ఉండే ప్రాణులకు వెలుగునిస్తాయి. ఆకాశంలోని ఈ గ్రహాల నుండి ప్రసరించే జ్యోతికిరణాలు తమ తమ బలం, దూరాన్ని అనుసరించి భూమిపై ఉన్న ప్రాణులను ప్రభావితం చేస్తాయి. వాస్తవానికి ఒక వ్యక్తి జనన సమయంలోని జ్యోతికిరణాలు అతని స్వభావానికి కారణమౌతాయి. మానవుని జీవితంపై, అతని జీవితంలోని వివిధ కోణాలపై ఈ జ్యోతికిరణాల ప్రభావాన్ని విశ్లేషించే శాస్త్రమే ‘జ్యోతిర్విజ్ఞానం’ లేదా ‘జ్యోతిష విజ్ఞానం’ అని పిలవబడుతుంది.

శిక్ష, కల్పం (సూత్రాలు), వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం వేదాలకు ఆరు అంగాలు. అందుచేత వేదాలను ‘షడంగ వేదాలు’ అంటారు. ‘వేదస్య నిర్మలం చక్షుర్జ్యోతి శాస్త్రమనుత్తమం’ అని నారదసంహితలో జ్యోతిషశాస్త్రాన్ని వేదాలకు నేత్రంగా చెప్పారు.

ఋగ్వేదంలోని మొదటి శ్లోకం –
‘విఫలాన్యన్యాశాస్త్రాణి వివాద స్తేషు కేవలమ్|
సఫలం జ్యోతిషం శాస్త్రం చంద్రాక్కౌ యాత్ర సాక్షిణౌ||
యథా శిఖామయూరణాం నాగానాం మణయో యథా|
తత్వద్వేదాంగ శాస్త్రాణాం జ్యోతిషం మూర్థని స్థితమ్’
అని చెప్పబడింది.

చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలం (క్రీ.శ. 380 నుండి 414)లో ఆర్యభట్టు ప్రసిద్ధ ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు. గణిత, జ్యోతిష శాస్త్రాల గౌరవాన్ని అత్యున్నత స్థితికి చేర్చాడు. ప్రాచీన మహర్షులు చేసిన సూర్యచంద్రుల గ్రహణ సమయాన్ని తెలుసుకునే విధానాన్ని ఆర్యభట్టు సంస్కరించి, సరైన గ్రహణ సమయాన్ని లెక్కించే విధానాన్ని రూపిందించి, ఆ మహర్షుల గౌరవానికి మరింత శోభ చేకూర్చాడు. వైదిక ఋషులు ద్వారా చెప్పబడిన శుభాశుభ సంఘటనల సమయాన్ని నిర్దిష్టంగా తెలుసుకోవటానికి 27 నక్షత్రాలపై ఆధారపడిన ఒక సమయసారిణి (సూచిక) సిద్ధం చేసాడు. భూమండలపై, భూమండల వాసులపై పడే గ్రహప్రభావాన్ని వివరించే ఒక చార్డ్ తయారుచేశాడు. ఆర్యభట్టీయమనే గ్రంథం రచించాడు. అది ప్రాచీన భారతచరిత్రలో స్వర్ణయుగం. నేటికీ ప్రపంచమంతా అతని గణనా విధానాన్నే అనుసరిస్తుంది. భారతదేశంలో ఇదే ప్రమాణం.

మధ్యయుగంలోని ప్రథమభాగంలో ఈ విజ్ఞానం మరింత ఉన్నతి చెందింది. ‘వరాహమిహిర’ పండితుడు దీనిని క్రమబద్ధం చేసి, అందులో అంకె నూతన తథ్యాలను సమీకరించి, బృహజ్జాతకమనే గ్రంథాన్ని రచించాడు. ఆ తరువాత కళ్యాణవర్మ, బ్రహ్మగుప్తుడు, మున్జాలుడు, చంద్రసేనుడు, శ్రీపతి, శ్రీధరుడు, భట్టవోసారి, మల్లిసేనుడు, బల్లాల సేనుడు, నరచంద్రుడు, అర్దదాసుడు, మకరందుడు, మహేంద్రసూరి, వైద్యనాథుడు, కేశవుడు, గణేశుడు, డుండిరాజు, నీలకంఠుడు మొదలైనవారు. 19వ శతాబ్దంలో మునీశ్వరుడు, దివాకరుడు, నిత్యానందుడు, ఉభయకుశల బాషుజేముని, జస్వంతసాగరుడు, జగన్నాథసమ్రాట్టు, బాపుదేవ శాస్త్రి, నీలాంబరషూ, సుధాకర ద్వివేది మొదలైన ప్రసిద్ధ రచయితలు, టీకాకరులు, సమీక్షలు జ్యోతిశ్శాస్త్ర సంబంధిత రచనలు అనేకం చేశారు. ఈ ప్రాచీన మహర్షులు, ఆచార్యులు, లేఖకులు తమ జ్ఞానప్రభా కిరాణాలతో రచించిన శ్లోకాల, రచనలు నేటికి అధ్యయన విషయాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ కాలంలోనే తక్షశిల, నలంద, మగధ, కాశి, ఉజ్జయిని, తంజావూరు, జయపూర్ మొదలైన ప్రదేశాల్లో జ్యోతిష సంభందిత పరిశోధనాశాలలు ఏర్పడ్డాయి. ఈ సంస్థల్లో భారతీయ, విదేశీయ విద్యార్థులు జ్యోతిర్విజ్ఞానాన్ని అధ్యయనం చేసేవారు. నేడు వీటిలో అనేక కేంద్రాలు నశించిపోయాయి.

ప్రపంచలో రెండు ప్రాచీన దేశాల్లోనే జ్యోతిర్విజ్ఞానం పూర్తిగా రెక్కలు తొడిగింది. మొదటిది భారదేశం, రెండవది గ్రీసుదేశం. క్రీస్తుకు పూర్వం అనేక శతాబ్దాలు భారతదేశంలో విస్తరించిన జ్యోతిర్విజ్ఞాన వటవృక్షఛాయలో అనేక విదేశీయులు తమ తమ దుఃఖాలు, సమస్యలకు సమాధానం పొంది శాంతి అనుభవించేవారు. మానవ జీవితంలో జ్యోతిష్యం ఉపయోగం, మహత్తు – మానవుని సమస్త కార్యాలు జ్యోతిషం ద్వారానే జరుగుతాయి. వ్యావహారికంగా ముఖ్యమైన ఉపయోగకర దినాలు, సమయం, తిథి, వారం, సప్తాహం, పక్షం, మాసం, ఋతువు, సంవత్సరం, అయనం, నక్షత్రం, యోగం, కరణం, చంద్రసంచారంచ సూర్యస్థితి మొదలైన జ్ఞానం జ్యోతిషం వల్లనే లభిస్తుంది. ఈ జ్ఞానం కోసం వివిధ ప్రదేశాల పేర్లను ఆధారంగా తీసికొని పంచాంగం చూసి సామాన్య జనులు కూడా ఈ విషయాలను గ్రహించగలరు. అలాగే చారిత్రాత్మక అంశాలు కూడా పొందుపరచబడతాయి. వాటిని గురించి కూడా మనం సంప్రదించి నిర్ణయాలు తీసుకోవచ్చు.

జల-చార రాశులు, జల-చర నక్షత్రాల సమయంలో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది. పామరుడైన పల్లెటూరి రైతు ఆకాశాన్ని పరిశీలించి వర్షం గురించిన అంచనా వేయగలుగుతాడు. పుష్కలంగా పంట పండటానికి తగు సమయం అంచనా వేసి గింజలు నాటుతాడు. సముద్రయానం చేసే నావికులు, వారి కెప్టెన్ (నాయకుడు) సముద్రంలో ప్రయాణించే సమయంలో సూర్యచంద్రులు స్థితిని చూసి వాతావరణాన్ని ఊహించగలుగుతారు. సురక్షిత మార్గాలను, సమయాన్ని నిర్ణయించుకుంటారు. అందుచేత హాని జరుగదు. జ్యోతిషంలో ఒక శాఖ రేఖాగణితం, పర్వతాల ఎత్తును, సముద్రాల లోటును కొలవటానికి ఉపయోగపడుతుంది. సూర్య చంద్ర గ్రహణాల ఆధారంగా ప్రాచీన చారిత్రాత్మక తిథులను తెలుసుకోవచ్చు. భూగర్భంలో లభించే పురాతత్వ వస్తువుల ప్రాచీనత్వం, వాటి సమయాన్ని అంచనా వేయవచ్చు.

ఆకాంక్ష, రేఖాంశ దిశాజ్ఞానం కలిగిస్తాయి. ఈ జ్ఞానం ద్వారా ప్రపంచంలోని అనేక రహస్యాలు, యుగాలను గురించిన వివరాలు సూర్య – చంద్ర గ్రహణ కాలాలు, ఆటుపోట్ల త్రీవత, సమయం…ఇవన్నీ జ్యోతిషం ద్వారా తెలుస్తాయి. ఉత్తమమైన ఔషధాలను ఎ సమయం, ఋతువుల్లో తయారుచేయాలో కనుగొనవచ్చు. రోగనివారణకు ఔషధాలను ఉపయోగించాల్సిన సమయం తెలుస్తుంది. ఈ విధంగా జ్యోతిషం ప్రత్యక్షంగా, పరోక్షంగా భూమిపై ఉన్న మానవులకే కాక సర్వప్రాణులకు లాభకరంగా ఉంటుంది. ఆందుచేతనే అజ్ఞానాంధకారం తొలగించే దీపం జ్యోతిషశాస్త్రం.

ఈ జ్యోతిర్విజ్ఞానాన్ని పాశ్చాత్య విద్వాంసులు వేల సంవత్సరాలుగా పరిశ్రమించి పాశ్చాత్య విధానంలో రూపొందించారు. ఫలిత జ్యోతిశంపై పాశ్చాత్యులకు ఎంతగా గురి కుదిరిందంటే, అక్కడ ఈ విషయంపై అనేక చర్చలు, ఉపన్యాసాలు, గ్రంథ ప్రకాశానం, వ్యాఖ్యానాలు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ ప్రజానీకానికి నిర్దుష్టమైన జ్ఞానం అందించే ప్రయత్నం చేస్తున్నారు.

అమెరికాలో ఈ విజ్ఞానానికి సంబంధిచిన ప్రత్యెక విశ్వవిద్యాలయాలు స్థాపించారు. అందులో ఉత్తీర్ణులైన యోగ్య విద్యార్థులకు మంచి పదవులు ఇవ్వబడుతున్నాయి.