యక్ష ప్రశ్నలు – జవాబులు

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ఆ ప్రశ్నలు ఇవే!!! ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన)

12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ణ్జం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

Advertisements

25 comments on “యక్ష ప్రశ్నలు – జవాబులు

  1. రవీంద్రగారు,
    మీ బ్లాగు చాలా బాగుందండి., మేము సంపుటి అనే పక్షపత్రికను చేస్తున్నాము. మీ బ్లాగులో విశేషాలు మీ పేరుతో మేము పబ్లిష్ చెయ్యవచ్చునా?
    Please let us know your thoughts on this
    Regards
    Lalitha

  2. venkat says:

    రవీంద్రగారు,
    మీ బ్లాగు చాలా బాగుందండి., మేము సంపుటి అనే పక్షపత్రికను చేస్తున్నాము. మీ బ్లాగులో విశేషాలు మీ పేరుతో మేము పబ్లిష్ చెయ్యవచ్చునా?

  3. venkat says:

    రవీంద్రగారు,
    మీ బ్లాగు చాలా బాగుందండి., మేము సంపుటి అనే padmashali masa పత్రికను చేస్తున్నాము. మీ బ్లాగులో విశేషాలు మీ పేరుతో మేము పబ్లిష్ చెయ్యవచ్చునా?
    nakshatradigitals@gmail.com
    venkat

  4. Rajya Laxmi I says:

    రావణాసురుడు యుద్ధంలో ఓడిపోయి, చనిపోవడానికి ముందు – రాముడు – లక్ష్మణుడిని పిలిచి – అతను చాలా విషయాలు తెలిసినవాడు. అతని దగ్గర తెలుసుకోవాల్సింది ఉంటే తెలుసుకుని రా అని పంపుతాడు. రావణుడి దగ్గరకు లక్ష్మణుడు వెళ్లి కొన్ని విషయాలు తెల్సుకుంటాడు. ఇలాగని ఎక్కడో చదివాను. ఈ ప్రస్తావన ఎక్కడ ఉంది ? రావణుడు లక్ష్మణుడికి చెప్పిన విషయాలు ఏమిటి ? తెలిపితే సంతోషిస్తాను.

  5. Rama says:

    Ravindra garu,

    మీ బ్లాగు చాలా బాగుందండి., మేము devotional website చేస్తున్నాము. మీ బ్లాగులో విశేషాలు మీ పేరుతో మేము పబ్లిష్ చెయ్యవచ్చునా?

  6. D.HARI PRASADA RAO says:

    ravindra garu very good

    D.HARI PRASADA RAO

    Email:damarla.hariprasad@yahoo.com

  7. mahesh says:

    RAVINDRA garu nenu modati sari chusinappudu 3hr chaduvutu undi poyanu chaala bagunnai sir

  8. mahesh says:

    RAVINDRA garu nenu modati sari chusinappudu 3hr chaduvutu undi poyanu chaala bagunnai sir

  9. Benarji says:

    Ravindra Garu Chala Bagundi

    Benarji

    benarji_116vsn@yahoo.co.in

  10. rathnamsjcc says:

    మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె తారక బ్రహ్మo
    హృదయమే మనసుకి మూలస్ధానం. ఇది మనసుయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో.నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి ,
    ఈ ఆత్మ నేనుకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి
    మదిని నిగ్రహించుట మనసు నిలిపి తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మాత్రం మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది మనసు నిలిపి లగ్నమై ఉంటుంది.
    మనసు నిలిపి  శరణాగతినే కోరుకుంటుంది జ్ఞాని  మార్గ ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం  ఆత్మ )సాక్షాత్కారం  తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం .’
    ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఒక క్షణంలోమనసు నిలిచి  అమనస్కమైన .క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి మట్టిచే తయారు చేయబడిన పాత్రలలో నామ రూప భేదమే కాని వాస్తవ భేద మెంత మాత్రము లేదు.
    ఉన్నది ఒకే బ్రహ్మo . వేమన ఆత్మలో ఏకస్వరూపాము. ఆత్మలో ఏ బేధం లేదని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు వేమన చెబుతున్నారు. బ్రహ్మo.సత్యాన్ని గ్రహించాలి.జీవన మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” బ్రహ్మoవున్నది. సూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అమరత్వము.అని కూడా అంటారు. బ్రహ్మo తత్త్వమేసాధించి విషయాన్ని మానవ జాతికి అందించడానికి సూక్ష్మసాధన
    బట్టియేమనసు సంకల్పము సృష్టి గోచరించుర సూక్ష్మ దృష్టి జ్ఞానమయమైన జగమంతయు బ్రహ్మ0చూడర అంతరంగ సూక్ష్మ దృష్టి బ్రహ్మజ్ఞాని లక్షణము దాటిననె మోక్షజ్ఞాన ఫలమురబహుజన్మ పుణ్యఫలమున మానవజన్మ దొరికెరఅమూల్య అవకాశము సద్వినియోగ పరుచర నరుడే నారాయణ స్వరూపుడని తెలియరబ్రహ్మం భావనిష్టలోమనసును నిలువరతెలియర నీవు ఆనందము చెందరా ఆనందము చెంది నీవు అచలుడవై నిలువర అచలాత్మానందమే అమర పదవిర అమర పదవినిచ్చు అఖిలాండ
    మనసును నిలువటమే లేనిపూజ పత్రిచేటని తెలియర నీ హృదయ మందిరంలో విశ్వేశ్వరుని చూడరజగన్మిధ్యా బ్రహ్మసత్యమని నమ్మర జీవో బ్రహ్మైవ నాపర:యని తెలియర అద్వైత మార్గంలో ఆత్మనిలుకడ చెందర ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని వస్తువు లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని జగము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యంలేని జీవము లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం లేని దైవం లేదు. ఆత్మ లో ఎరుక చైతన్యం.లేని ఏ నేనే లేదు. సమస్త ఆత్మ లో ఎరుక చైతన్యం నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఆత్మ లో ఎరుక చైతన్యం ఏకీభవించి ఆత్మ లో ఎరుక చైతన్యం నాయందే లీనమైయున్నది నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము.B.రత్నం

  11. addanki srinivas says:

    bharadwaj meaning

  12. rathnamsjcc says:

    మనసు సంకల్పము సృష్టి గోచరించును సంకల్పములేనిదే మోక్షాన్ని పొందుతారుస్థూలదృష్టికి అందేది కాదు అంతరంగ సూక్ష్మ దృష్టి బ్రహ్మజ్ఞాని లక్షణము

  13. sureshkhanna says:

    Thank u sir

  14. exlent divine script

  15. good life lessons

  16. శ్రీ రవీంద్ర గారికి,
    నమస్కారములు. ఈ బ్లాగు ద్వారా ఎందరో మహనీయులు తెలిపిన ఎన్నో జీవిత సత్యాలను ప్రచారం చేస్తూ పాటకులలో మానవతా విలువలను, ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నధులకు కృతజ్ఞతలు.
    – ఈశ్వర్ రెడ్డి

  17. nagendra says:

    నిజంగా ఈ బ్లాగు బాగు బాగు.. !

  18. మీ వాఖ్యలకి ధన్యవాదములు.

  19. pvenugopal says:

    ravanasurudd lakshmanduki telipinadi emite ante mancini postphone chehyakunda undatamay

  20. kavitha says:

    మాకు తెలియని మంచి విషయములు చెప్పినందుకు దన్యవాదములు అండి

  21. sambasivarao says:

    ఈ విషయాలు ఇందులో పొ౦దుపరచన వార౦దరికి దన్యవాదములు

  22. sreenu samala says:

    Ravindra garu please share telugu puranas

  23. Definitely sir, I am trying to write them reading from different books. Soon will share.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s