అలనాటి ఇరిగేషన్ ఇంజనీర్ గౌతముడు

బ్రహ్మదేవుడు తన ఎదురుగా ఉన్న అందాల భరణివైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆయనలో పితౄ వాత్సల్యం పొంగిపొరలుతుండడమే కాదు, ఆ అతిలోక సౌందర్యం ఆయనను ఆశ్చర్యచకితం చేస్తోంది. తన సౄష్టి నైపుణ్యం ఇంతటిదా!! అనుకుంటూ తనలో తనే విస్మితుడవుతున్నాడు.

తన సౄష్టిలో ఇంతటి అందాలరాశి ఇంకెక్కడా ఉండదు. ఈమె త్రిలోక సుందరి. ఈమెను చూసి విష్ణువు, శివుడు కూడా సమ్మోహితులైనా ఆశ్చర్యంలేదు. ఇక ఇంద్రాదుల సంగతి చెప్పనే అవసరంలేదు. ఇంతకీ ఈ అతిలోక సుందరిని తాను సౄష్టించనైతే సౄష్టించాడుకానీ, ఈమెకు తగిన వరుణ్ణి ఎక్కడి నుంచి తేవాలి?

రూపవంతులైన దేవతల నొక్కక్కరినే గుర్తు చేసుకుంటూ బ్రహ్మదేవుడు పెదవి విరచాడు. ‘ఊహూ వీళ్ళెవరూ పనికిరారు, వీళ్ళల్లో ఎవరికిచ్చినా కాకి ముక్కుకు దొండపండును తగిలించడమే అవుతుందీ అనుకున్నాడు.

ఆయనలా ఆలోచనలతో సతమతమవుతుండగానే ఒక బ్రహ్మచారి అక్కడికి అడుగుపెట్టి బ్రహ్మదేవునికి అభివాదం చేశాడు. అతని ముఖంలో అపూర్వమైన తేజస్సు తాండవిస్తోంది. అతడు నడిచివస్తుంతే సరస్వతి నడచివస్తున్నట్టే ఉంది. అంతే కాదు, అతని ముఖంలో ఒక విధమైన నిర్లిప్తత, నిర్వికారత, వైరాగ్యం కూడా తొంగిచూస్తున్నాయి.

విచిత్రం…బ్రహ్మదేవుడు త్రిభువన సుందరిగా భావిస్తున్న ఆయన కుమార్తె అక్కడె ఉన్నా, ఈ బ్రహ్మచారి ఓరకంటతో కూడా ఆమెవైపు చూడలేదు. బ్రహ్మదేవునికి ఈ బ్రహ్మచారిని చూడగానే ముచ్చట కలిగినా అతని నిరాసక్తతకు ఒకింత కోపమూ వచ్చింది. కొంత అహమూ దెబ్బతింది.

‘బ్రహ్మచర్యమూ, తపస్సూ, ఇంద్రియనిగ్రహమూ అవసరమే. కాని సౄష్టి సౌందర్యాన్ని బొత్తిగా పట్టించుకోకపోతే ఎలా? అందాల కొమ్మను చూసి కొంచమైనా అకర్షితులుకాకపోతే సౄష్టి ఎలా సాగుతుంది?’ అనుకున్నాడు.

అంతలోనే ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని దర్శనానికి అక్కడికి వచ్చారు. వస్తూనే వారి దౄష్టి బ్రహ్మ మీద కాక ఆయన సరసనే ఉన్న ఆ జగదేకసుందరి మీద పడింది. వాళ్ళ చూపులు తుమ్మెదలై ఆ కుసుమకోమలి మీద వాలిపోతున్నాయి. చేపట్టితే ఈమెనే చేపట్టాలని ఎవరికివారు మనసులో నిశ్చయించుకున్నారు.

వాళ్ళ మనోభావాలను బ్రహ్మదేవుడు ఇట్టే చదవగలిగాడు. బ్రహ్మచారివైపు చూశాడు. అతడు అలాగే నిర్లిప్తంగా, నిర్వికారంగా ఉన్నాడు. చటుక్కున బ్రహ్మదేవునిలో ఒక ఆలోచన మెరిసింది. అక్కడున్నవారిని ఉద్దేశించి అన్నాడు.

‘ఈమె నా కుమార్తె. ఈమెకు వివాహం చేద్దామనుకుంటున్నాను..’

‘నేను చేసుకుంటాను…నేను చేసుకుంటానూ అన్నట్టుగా ఇంద్రాదులందరూ ఆశగా ఆయనవైపు చూస్తున్నారు.

‘అయితే ఒక షరతు. భూప్రదక్షిణం చేసి ఎవరు మొట్టమొదట నాదగ్గరకు వస్తారో వారికే ఈమేనిచ్చి పెళ్ళిచేస్తానూ అన్నాడు బ్రహ్మదేవుడు.

ఆ మాట వినీవినగానే ఇంద్రాదులు విడిచిన బాణంలా అక్కడినుంచి పరుగుదీసి తమతమ వాహనాలెక్కి భూప్రదక్షిణకు బయలుదేరారు.

బ్రహ్మచారి మాత్రం అక్కడే ఉన్నాడు. ఇంద్రాదుల హడావుడి చూసి తనలో తనే నవ్వుకున్నాడు. గోవుకు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టేనని వేదం చెబుతోంది. తొందరలో వీళ్ళు ఆ విషయం మరచిపోయి ఉంటారనుకున్నాడు. తనకామెను పెళ్ళాడాలన్న కోరికలేనేలేదు. అయినా వేదప్రామాణ్యాన్ని ఆన్ని పరీక్షించడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మే వేదం పేర్కొన్న ఆ మాత నిజమని నిరూపిస్తే అంతకంటె ఏం కావాలి? అనుకున్నాడు.

బ్రహ్మదేవుడికి తెలియనిదేముంటింది? అతని ఆంతర్యాన్ని ఇట్టే కనిపెట్టాడు. బ్రహ్మచారి లేచి దిక్కులు చూస్తున్నంతలోనే అక్కడ ఈనడానికి సిద్ధంగా ఉన్న గోమాత కనిపించింది. బ్రహ్మచారి ఆ గోవును సమీపించి ప్రదక్షిణ చేశాడు. వచ్చి బ్రహ్మదేవుని ఎదుట నిలబడ్డాడు.

బ్రహ్మదేవుడి కళ్ళు సంతోషంతో సంతౄప్తితో మెరిశాయి.

‘నువ్వే గెలిచాచు. ఈ కొమ్మను అర్థాంగిగా స్వీకరించు. ఎటువంటి సంకోచం పెట్టుకోకు. నీ తపస్సుకు ఈమె వల్ల ఎటువంటి విఘ్నమూ కలగదు. ఈమె సదా నీసేవ చేసుకుంటూ నీడలా నిన్ను అనుసరించి ఉంటుంది.’ అని చెప్పి ఆమె చేతులను ఆ యువకుని చేతుల్లో ఉంచి దంపతులను ఆశీర్వదించాడు.

‘విధి శాసనం’ అనుకుంటూ ఆ యువకుడు బ్రహ్మకు మొక్కి అక్కడినుంచి కదిలాడు. మబ్బుచాటు చంద్రునిలా మేలి ముసుగులో ముఖబింబాన్ని దాచుకుంటూ సిగ్గుబరువుతో అడుగులు తడబడుతుండగా ఆ ఒప్పులకుప్ప అతని వెంట నడిచింది. అతని పేరు గౌతముడు. ఆమె పేరు అహల్య.

ౠషి పరంపరంలోని ఒక ఆణిముత్యం గౌతముడు. అతడెంత బుద్ధికుశలుడోపై ఉదంతం ౠజువు చేస్తోంది. ఆ బుద్ధికౌశల్యాన్ని అతడు పరోపకారానికే వినియోగించాడు తప్ప, స్వార్థానికి వాడుకోలేదు. ౠషుల ప్రత్యేకతా, విశిష్టతా, అదే. తమ శక్తియుక్తులన్నింటినీ వారు లోకకల్యాణానికి వినియోగించారు కనుకనే నేటికి స్మరణీయులవుతున్నారు.

అతిధి దేవోభవ

గౌతముడు కొంతకాలం దండకారణ్యంలో దండకారణ్యంలో తపస్సు చేశాడు. తర్వాత హిమాలయాలలోని శతశౄంగం వద్ద ఆశ్రమం నిర్మించుకుని అహల్యతో గౄహస్థ జీవితం గడుపుతూ తపస్సు ఆచరిస్తూ ఆదర్శగౄహస్థుగా జీవించాడు.

ఇలా ఉండగా ఒకసారి ఆ ప్రాంతంలో కరవు కాటకాలు విలయతాండవం చేశాయి. నీటిచుక్క లేక పొలాలు ఎండి బీటలు తీశాయి. ఆకలి దప్పులతో మనుషులేకాక ప్శుపక్ష్యాదులు కూడా అల్లాడి పోయాయి. ఈ స్థితిలో అహల్యా గౌతములు ప్రజలకు చేసిన సేవ నిరుపమానం. గౌతముడు శివుని ప్రసన్నం చేసుకుని తన అధీనంలోని భూములు ఏటువంటి కరవు కాటకాల్లో కూడా, పంటలు, ఫలాలు పండిస్తూ పచ్చగా ఉండేలా వరం పొందాడు. దాంతో ౠషులతో సహా ఎక్కడెక్కడివారూ గౌతముని ఆశ్రమానికి వచ్చి చేరారు. చూస్తుండగానే శతశృంగ పర్వతం అన్నార్తులతో నిండిపోయింది. అహల్యా గౌతములు విసుగు విరామం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆదరించి అన్నం పెట్టారు.

బ్రహ్మదేవుడు తన ఎదురుగా ఉన్న అందాల భరణివైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆయనలో పితౄ వాత్సల్యం పొంగిపొరలుతుండడమే కాదు, ఆ అతిలోక సౌందర్యం ఆయనను ఆశ్చర్యచకితం చేస్తోంది. తన సౄష్టి నైపుణ్యం ఇంతటిదా!! అనుకుంటూ తనలో తనే విస్మితుడవుతున్నాడు.

తన సౄష్టిలో ఇంతటి అందాలరాశి ఇంకెక్కడా ఉండదు. ఈమె త్రిలోక సుందరి. ఈమెను చూసి విష్ణువు, శివుడు కూడా సమ్మోహితులైనా ఆశ్చర్యంలేదు. ఇక ఇంద్రాదుల సంగతి చెప్పనే అవసరంలేదు. ఇంతకీ ఈ అతిలోక సుందరిని తాను సౄష్టించనైతే సౄష్టించాడుకానీ, ఈమెకు తగిన వరుణ్ణి ఎక్కడి నుంచి తేవాలి?

రూపవంతులైన దేవతల నొక్కక్కరినే గుర్తు చేసుకుంటూ బ్రహ్మదేవుడు పెదవి విరచాడు. ‘ఊహూ వీళ్ళెవరూ పనికిరారు, వీళ్ళల్లో ఎవరికిచ్చినా కాకి ముక్కుకు దొండపండును తగిలించడమే అవుతుందీ అనుకున్నాడు.

ఆయనలా ఆలోచనలతో సతమతమవుతుండగానే ఒక బ్రహ్మచారి అక్కడికి అడుగుపెట్టి బ్రహ్మదేవునికి అభివాదం చేశాడు. అతని ముఖంలో అపూర్వమైన తేజస్సు తాండవిస్తోంది. అతడు నడిచివస్తుంతే సరస్వతి నడచివస్తున్నట్టే ఉంది. అంతే కాదు, అతని ముఖంలో ఒక విధమైన నిర్లిప్తత, నిర్వికారత, వైరాగ్యం కూడా తొంగిచూస్తున్నాయి.

విచిత్రం…బ్రహ్మదేవుడు త్రిభువన సుందరిగా భావిస్తున్న ఆయన కుమార్తె అక్కడె ఉన్నా, ఈ బ్రహ్మచారి ఓరకంటతో కూడా ఆమెవైపు చూడలేదు. బ్రహ్మదేవునికి ఈ బ్రహ్మచారిని చూడగానే ముచ్చట కలిగినా అతని నిరాసక్తతకు ఒకింత కోపమూ వచ్చింది. కొంత అహమూ దెబ్బతింది.

‘బ్రహ్మచర్యమూ, తపస్సూ, ఇంద్రియనిగ్రహమూ అవసరమే. కాని సౄష్టి సౌందర్యాన్ని బొత్తిగా పట్టించుకోకపోతే ఎలా? అందాల కొమ్మను చూసి కొంచమైనా అకర్షితులుకాకపోతే సౄష్టి ఎలా సాగుతుంది?’ అనుకున్నాడు.

అంతలోనే ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని దర్శనానికి అక్కడికి వచ్చారు. వస్తూనే వారి దౄష్టి బ్రహ్మ మీద కాక ఆయన సరసనే ఉన్న ఆ జగదేకసుందరి మీద పడింది. వాళ్ళ చూపులు తుమ్మెదలై ఆ కుసుమకోమలి మీద వాలిపోతున్నాయి. చేపట్టితే ఈమెనే చేపట్టాలని ఎవరికివారు మనసులో నిశ్చయించుకున్నారు.

వాళ్ళ మనోభావాలను బ్రహ్మదేవుడు ఇట్టే చదవగలిగాడు. బ్రహ్మచారివైపు చూశాడు. అతడు అలాగే నిర్లిప్తంగా, నిర్వికారంగా ఉన్నాడు. చటుక్కున బ్రహ్మదేవునిలో ఒక ఆలోచన మెరిసింది. అక్కడున్నవారిని ఉద్దేశించి అన్నాడు.

‘ఈమె నా కుమార్తె. ఈమెకు వివాహం చేద్దామనుకుంటున్నాను..’

‘నేను చేసుకుంటాను…నేను చేసుకుంటానూ అన్నట్టుగా ఇంద్రాదులందరూ ఆశగా ఆయనవైపు చూస్తున్నారు.

‘అయితే ఒక షరతు. భూప్రదక్షిణం చేసి ఎవరు మొట్టమొదట నాదగ్గరకు వస్తారో వారికే ఈమేనిచ్చి పెళ్ళిచేస్తానూ అన్నాడు బ్రహ్మదేవుడు.

ఆ మాట వినీవినగానే ఇంద్రాదులు విడిచిన బాణంలా అక్కడినుంచి పరుగుదీసి తమతమ వాహనాలెక్కి భూప్రదక్షిణకు బయలుదేరారు.

బ్రహ్మచారి మాత్రం అక్కడే ఉన్నాడు. ఇంద్రాదుల హడావుడి చూసి తనలో తనే నవ్వుకున్నాడు. గోవుకు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టేనని వేదం చెబుతోంది. తొందరలో వీళ్ళు ఆ విషయం మరచిపోయి ఉంటారనుకున్నాడు. తనకామెను పెళ్ళాడాలన్న కోరికలేనేలేదు. అయినా వేదప్రామాణ్Yఆన్ని పరీక్షించడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మే వేదం పేర్కొన్న ఆ మాత నిజమని నిరూపిస్తే అంతకంటె ఏం కావాలి? అనుకున్నాడు.

బ్రహ్మదేవుడికి తెలియనిదేముంటింది? అతని ఆంతర్యాన్ని ఇట్టే కనిపెట్టాడు. బ్రహ్మచారి లేచి దిక్కులు చూస్తున్నంతలోనే అక్కడ ఈనడానికి సిద్ధంగా ఉన్న గోమాత కనిపించింది. బ్రహ్మచారి ఆ గోవును సమీపించి ప్రదక్షిణ చేశాడు. వచ్చి బ్రహ్మదేవుని ఎదుట నిలబడ్డాడు.

బ్రహ్మదేవుడి కళ్ళు సంతోషంతో సంతౄప్తితో మెరిశాయి.

‘నువ్వే గెలిచాచు. ఈ కొమ్మను అర్థాంగిగా స్వీకరించు. ఎటువంటి సంకోచం పెట్టుకోకు. నీ తపస్సుకు ఈమె వల్ల ఎటువంటి విఘ్నమూ కలగదు. ఈమె సదా నీసేవ చేసుకుంటూ నీడలా నిన్ను అనుసరించి ఉంటుంది.’ అని చెప్పి ఆమె చేతులను ఆ యువకుని చేతుల్లో ఉంచి దంపతులను ఆశీర్వదించాడు.

‘విధి శాసనం’ అనుకుంటూ ఆ యువకుడు బ్రహ్మకు మొక్కి అక్కడినుంచి కదిలాడు. మబ్బుచాటు చంద్రునిలా మేలి ముసుగులో ముఖబింబాన్ని దాచుకుంటూ సిగ్గుబరువుతో అడుగులు తడబడుతుండగా ఆ ఒప్పులకుప్ప అతని వెంట నడిచింది. అతని పేరు గౌతముడు. ఆమె పేరు అహల్య.

ౠషి పరంపరంలోని ఒక ఆణిముత్యం గౌతముడు. అతడెంత బుద్ధికుశలుడోపై ఉదంతం ౠజువు చేస్తోంది. ఆ బుద్ధికౌశల్యాన్ని అతడు పరోపకారానికే వినియోగించాడు తప్ప, స్వార్థానికి వాడుకోలేదు. ౠషుల ప్రత్యేకతా, విశిష్టతా, అదే. తమ శక్తియుక్తులన్నింటినీ వారు లోకకల్యాణానికి వినియోగించారు కనుకనే నేటికి స్మరణీయులవుతున్నారు.

అతిధి దేవోభవ

గౌతముడు కొంతకాలం దండకారణ్యంలో దండకారణ్యంలో తపస్సు చేశాడు. తర్వాత హిమాలయాలలోని శతశౄంగం వద్ద ఆశ్రమం నిర్మించుకుని అహల్యతో గౄహస్థ జీవితం గడుపుతూ తపస్సు ఆచరిస్తూ ఆదర్శగౄహస్థుగా జీవించాడు.

ఇలా ఉండగా ఒకసారి ఆ ప్రాంతంలో కరవు కాటకాలు విలయతాండవం చేశాయి. నీటిచుక్క లేక పొలాలు ఎండి బీటలు తీశాయి. ఆకలి దప్పులతో మనుషులేకాక ప్శుపక్ష్యాదులు కూడా అల్లాడి పోయాయి. ఈ స్థితిలో అహల్యా గౌతములు ప్రజలకు చేసిన సేవ నిరుపమానం. గౌతముడు శివుని ప్రసన్నం చేసుకుని తన అధీనంలోని భూములు ఏటువంటి కరవు కాటకాల్లో కూడా, పంటలు, ఫలాలు పండిస్తూ పచ్చగా ఉండేలా వరం పొందాడు. దాంతో ౠషులతో సహా ఎక్కడెక్కడివారూ గౌతముని ఆశ్రమానికి వచ్చి చేరారు. చూస్తుండగానే శతశృంగ పర్వతం అన్నార్తులతో నిండిపోయింది. అహల్యా గౌతములు విసుగు విరామం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆదరించి అన్నం పెట్టారు. ఎవరిని చిన్నబుచ్చలేదు. తమ చేయిపైన , వారి చేయి కింద అయిందని కొంచెం కుఉడా అహమ్కరిమ్చకుమ్డా నినయవిధేయతల్తో, అతిథి స్వయంగా విష్ణువేనన్న భావనతో వారిని సేవిమ్చారు. అహంకారం లేకపోవడమే ఋశిత్వం.

అతిథిసేవలో అంతటి వాళ్ళులేరన్న కీర్తి దశదిశలా పాకింది. దేవతలు కూడా దిగివచ్చి ఆ పుణ్యదంపతులను దర్శించి అభినందించి వెళ్ళారు. ఇంతలోనే ఒక విశేషం జరిగింది.

తల్లీకొడుకుల పన్నాగం

శివుని నెత్తెక్కి కూర్చుని కులుకుతున్న తన సవతి గంగను చూసి పార్వతీదేవికి చాలా అక్కసుగా ఉంది. గంగను వెళ్ళగొట్టడమెలాగా అనుకొంటూ కూమారుడైన గణపతితో ఆలోచించింది. ‘నువ్వు నిశ్చింతగా ఉండు, నేను ఉపాయం చూస్తా’ నని గణపతి తల్లికి మాటిచ్చాడు. అతని చూపు గౌతముని మీద పడింది. కీ పెద్దమనిషి కరవు కాలంలో అన్నార్తులను అదుకుంటూ అమోఘమైన సేవ చేస్తున్నాడు. గంగను కిందికి దింపే అర్హత, పుణ్యం ఇతనికే ఉన్నాయనుకున్నాడు. అయితే అందుకు ఎంతో తపస్సును ధారపోయాలి. అది కూడా ఇతనికే సాధ్యమని నిశ్చయించుకుని గణపతి భూలోకానికి దారితీసి శతశౄంగానికి చేరుకున్నాడు. బ్రాహ్మణ వేషంలో గౌతమ ఆశ్రమానికి వెళ్ళి ఆ దంపతులనుంచి స్వాగతసత్కారాలు అందుకున్నాడు.

వెంటెనే తన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. పార్వతి పరిచారికలలో ఒకరిని రప్పించి గోరూపం ధరించమన్నాడు. గౌతముని పొలంలో మేస్తూ ఉండమని, గౌతముడు ఏ కొంచెం అదిలించినా ప్రాణం విడవమని చెప్పి పంపించాడు. తల పొలంలో కోతకు సిద్ధంగా ఉన్న పంటను మేస్తున్న గోవును చూసి, గౌతముడు దర్భపోచతో అదిలించబోయే సరికి గోవు కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

గౌతముని విచారం – గణపతి ఓదార్పు

గౌతముడు నిర్విణ్ణుడయ్యాడు. గోహత్యాపాతకాన్ని తలచుకుని త్రీవ విచారంలో మునిగిపోయాడు. అహల్య కూడా అవాక్కయింది. ఈ వార్త దావానంలా ఇట్టే వ్యాపించి అందరూ ముక్కున వేలేసుకున్నారు. గోహత్యాపాపం మూటగట్టుకున్నావని గౌతముని అనేకవిధాలుగా నిందించి ఒక్కొక్కరూ ఆశ్రమం వీడి వెళ్ళిపోయారు. అంతవరకూ అతిథిదేవుళ్లతో కళకళలాడిన ఆశ్రమ పరిసరాలు ఇప్పుడు నిర్యానుష్యంగా నిష్పచ్చరంగా మారిపోగా అహాల్య గౌతములిరువురూ దు:ఖభారంతో కూలబడిపోయారు. ఆ సమయంలో వెళ్ళాడు బ్రాహ్మణవేషంలో ఉన్న గణపతి. ‘తపోధనుడైన నువ్వు అంత బేలగా బాధపడడం శోభస్కరం కాదు. తపస్సుచేసి శివుని మెప్పించి గంగను నేలమీదికి రప్పించు. గంగాజలం సోకగానే గోవు బతికి లేస్తుంది. నీ గోహత్యా కళంకం తొలిగిపోతుందీ అని చెప్పాడు.

గౌతముని మదిలో ఆశాదీపం తళుక్కున మెరిసింది. ఆలోచించగా ఇదంతా దైవలీల అని ఆయనకు తోచింది. కరవుకాటకాలతో విలవిలలాడుతున్న నేలమీదికి కైలాసగంగను రప్పించాలన్నది దైవనిర్ణయం కాబోలు! అందుకు తను ఒక సాధనంగా మారుతున్నాడన్నమాట. అదెంతటి మహద్భాగ్యం!

గోదావరి పుట్టుక

ఈ దివ్యసూచ చేసినందుకు ఆ బ్రాహ్మణునికి మొక్కి కౄతజ్ణ్జతలు చెప్పుకొని గౌతముడు సతీసమేతంగా హేమవనానికి వెళ్ళాడు. అక్కడ ఒంటికాలు మీద నిలిచి శివుని గురించి తీవ్ర తప్పస్సు చేశాడు. శివుడు మెచ్చి తన జడపాయనొకదానిని పెరికి గౌతమునికిచ్చి పిండమన్నాడు. పిండగా నీరు నేలమీద పడి నదిగా ప్రవహించింది. ఆ నదే గోదావరి. గౌతముని తపోఫలంగా అవతరించింది కనుక ‘గౌతమీ అయింది. గోవును బతికించింది కనుక గోదావరి అయింది.

ఈ కథకే పాఠాంతరం ఉంది. గౌతముని అతిథ్యం పొందిన బ్రాహ్మణులే అతని కీర్తినీ, అన్న సంపదనూ చూసి ఓర్వలేక మాయ గోవును సౄష్టించి అతని పొలంలోకి విడిచిపెట్టారని, గౌతముడు అదలించబోగా అది మరణించడంతో గోహత్యా కళంకాన్ని అతనికి అపాదించారని దీని సారాంశం. అయితే రెండు కథల్లోనూ ఉమ్మడిగా ఉన్న అంశం కరవుకాటకాలతో ప్రజలను గౌతముడు అదుకోవడం, గంగను నేలమీదికి రప్పించడం. దీనినిబట్టి గౌతముడు నదీజలాలను పంట భూములకు మళ్ళించి కరవుకాటకాలను నివారించడంలో ప్రముఖపాత్ర వహించిన మేధావి అనీ, నేటి భాషలో చెప్పుకోవాలంటే గొప్ప ‘ఇరిగేషన్ ఇంజనీర్ ‘ అని అర్థమవుతుంది. ఇలా తన మేధాశక్తిని లోకకల్Yఆణానికి వినియోగించాడు. కనుకనే గౌతముడు మహర్షిగా చరితార్థుడయ్యాడు.

‘అహల్య అంటే….’

ఈ కోణం నుంచి చూస్తే అహల్య అనే పేరు కూడా గౌతముడు నిర్వర్తించిన ఈ పాత్రనే సూచిస్తుంది. ‘అహల్యా అంటే నాగలితో దున్నబడనిదని అర్ధం. అంటే సేద్యయోగ్యంకాని భూమి అన్నమాట. గౌతముడు అహల్యను చేపట్టడమంటే సేద్యయోగ్యంకాని భూముల బాధ్యతను స్వీకరించి వాటిని సేద్యయోగం చేశాడన్నమాట.

మేధస్సుకు ఆధ్యాత్మిక కోణాన్ని జోడిస్తేనే అది విశ్వకల్యాణానికి వినియోగమవుతుంది. ఆధ్యాత్మిక దౄష్టిలోపించిన మేధస్సు స్వార్థానికి, లోకవినాశనానికే తోడ్పడుతుంది. మేధస్సుకు ఆధ్యాత్మిక దౄష్టిని జోడించడమే తపస్సు. ౠషుల కథలు అందించే గొప్ప సందేశం ఇదే.

అహల్య ‘తప్పూ చేసిందా?

ఇక అహల్య ‘కళంకితాగా భావింపచేసే కొన్ని విచిత్రమైన ఉదంతాలు పురాణాల్లో కనిపిస్తాయి. వాటిలో బాగా ప్రసిద్థంగా కనిపించేది ఇంద్రుడితో కలసి ఆమె చేసిన తప్పు. గౌతమహల్యలు మిథిలానగరానికి చేరువగా ఒక ఆశ్రమంలో ఉంటున్నప్పుడు దేవేంద్రుడు అహల్యను కామిస్తాడు. తెల్లవారడానికే చాలమేందు కోడిరూపంలో గౌతమాశ్రమాన్ని సమీపించి తన కూతతో గౌతముని మేలుకొలుపుతాడు. తెల్లవారిందనుకిని గౌతముడు స్నానానికి వెడతాడు. పొరపాటు గుర్తించిన వెంటనే తిరిగి వచ్చిన గౌతముడు ఇంద్రుడి దుశ్చర్యను గమనిస్తాడు. రాజ్యభ్రష్టుడివి కమ్మనీ, నీ శరీరమంతా యోనులతో నిండిపోతుందనీ ఇంద్రునీ, బూడిదలో పొర్లుతూ గాలిపీల్చి బతుకుతూ, తపస్సు చేస్తూ పడి ఉండమని శపిస్తాడు. శ్రీరామపదస్పర్శతో నీకు మళ్ళీ పూర్వరూపం వస్తుందని శాపవిమోచనం చెబుతాడు.

ఇంకో పురాణకథ ప్రకారం ఇంద్రసూర్యుల వల్ల అహల్యకు ఇద్దరు కుమారులు కలుగుతారు. గౌతముడు వారు తన కుమారులే అనుకుంటాడు. ఒకనాడు ఆ కుమారులిద్దరినీ ఎత్తుకుని, తనవల్ల అహల్యకు కలిగిన కూతురు అంజనను నడిపించుకుంటూ సముద్రతీరానికి వెడతాడు. అప్పుడు అంజన, ‘నీ కన్న కూతురును నడిపిస్తూ ఇతరుల పిల్లలను ఎత్తుకున్నావు. ఇదేం న్యాయం? అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు ‘వీళ్ళు పరుల పిల్లలైతే వానరులవుతారూ అంటూ సముద్రంలో పడేస్తాడు. వాళ్ళే వాలి, సుగ్రీవులు. కూతురు తన గుట్టు బయతపెట్టినందుకు అహల్య కోపించి గుడ్దిగానికి కమ్మనీ, నీకు వారరుడు కొడుకుగా పుడతాడనీ అంజనను శపిస్తుంది. అంజనకు పుట్టినవాడే ఆంజనేయుడు.

ఈ కథలు అహల్యను కళంకిత గా చిత్రింస్తుండగా, పరంపరంగా ప్రచారంలో ఉన్న ఒక శ్లోకం అహల్యౌ పంచకన్యలలో ఒకరుగా చేర్చి చెబుతుంది.
ఆశ్లోకం ఇది:
అహల్యాద్రౌపదీసీతా తారా మండోదరీ తథా
పంచకన్యాస్స్మరేన్నిత్యం మహాపాతకనాశనం
అహల్య, ద్రౌపది, సీత, మండోదరి, తార అనే అయిదుగురు పంచకన్యలనీ, వీరి పేర్లు రోజూ స్మరిస్తే మహాపాపాలు కూడా నశిస్తాయని ఈశ్లోకానికి అర్థం.
ఇంద్రుడంటే….?
కళంకితా? కన్యా? ఏది నిజం అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. ఇటువంటి సందర్భాలలోనే ఇలాంటి కథలను దౄష్టికోణాన్ని మార్చుకుని చూడాలి. ఎందికంటే పురాణకర్తలు సూటిగా కథ చెప్పరు. పైకి విడ్డూరంగా కనిపించే కథల్లో అంతర్లీనంగా ఆధ్యాత్మిక విషయాలు చొప్పిస్తూ ఉంటారు. ఉదాహరణకు అహల్య, ఇంద్రుల వౄత్తాంతమే  చూద్దాం. ఇంద్రుడంటే ఇంద్రియాలని అర్థం చెబుతారు. ఇంద్రియాలకు లొంగితే ఎటువంటి పతనం సంభవిస్తుందో అహల్యకు, ఇంద్రునికి గౌతముడిచ్చిన శాపాలు సూచిస్తాయి. ఆ పతనం నుంచి బయటపడడానికి భగవచ్చింతనే మార్గం. శ్రీరామపద స్పర్శతో నీకు శాపవిమోచనం కలుగుతుందని గౌతముడు అహల్యకు చెప్పడంలో అర్థమిదే. అలాగే వికౄత చింతనతో అపరాధభావంతో చేయకూడని పనిచేసినప్పుడు దాని ఫలితం కూడా వికౄతంగానే ఉంటుందని రెండో కథ చెబుతుంది.
అహల్యాగౌతములకు అంజన అనే కూతురు కాక మరో పుత్రిక, శతానందుడు, శరద్వంతుడు అనే కుమారులు కూడా ఉన్నారు. శతానందుడు మిథిలను పాలించే జనకమహారాజు వద్ద పురోహితుడు. శరద్వంతుడు ధనుర్విద్యలో నిష్ణాతుదు. మహాభారతంలోని ద్రోణాచార్యుని భార్య కౄపి, కౄపాచార్యుడు ఇతని సంతానమే.
మహాభారతంలోని మరో ప్రసిద్థముని ఉందకుడు గౌతముని శిష్Yఉడు. గౌతముడు ఇతనికి యవ్వనాన్ని ప్రసాదించి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. అందుకు సంతోషించిన ఉదంకుడు ఏదైనా కోరితే తెచ్చి ఇస్తానని గురుపత్ని అయిన అహల్యతో అంటాడు. మిత్రసహుడనే రాజు భార్య మదయంతి ధరించే కుండలాలను తెచ్చి ఇమ్మని అహల్య అడుగుతుంది. ఉందంకుడు వాటిని తీసుకువస్తుండగా మార్గ మధ్యంలో ఒక సర్పం వాటిని అపహరింస్తుంది. ఉదంకుడు వాటిని తిరిగి సంపాదించి గురుపత్నికి ఇస్తాడు. సర్పం తనకు చేసిన అపకారానికి కోపించిన ఉదంకుడు తర్వాత సర్పయాగం చేసి సర్పాలన్నింటినీ వధించమని పరీక్షుత్తు కుమారుడైన జనమేజయుని ప్రోత్సహిస్తాడు.
గౌతముని గురువు అగ్నిదేవుడు. గౌతముడు అంగిరస పరంపరకు చెందినవాడు. అగ్నిని పూనించిన వారిలో అంగిరసులు ప్రముఖులు, గౌతమ గోత్రీకులకు అంగిరసుడు, ఆయాస్యుడు, గౌతముడు ౠషులు.
తన మేథాశక్తిని తపశ్శక్తిని మేళవించి అనేక అద్భుతాలు చేసి ప్రజలను ఆదుకున్న నిస్వార్థ సేవా తత్పరుడు గౌతముడు. ఆయనకు అర్థాంగిగా అన్నింటా చేదోడుగా ఉన్న నారీరత్నం అహల్య.
ఆ దంపతుల స్మరణ ఎంతో పుణ్యప్రదం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s