ఎవరు పరమాత్ముడు?


వేదవ్యాసుని శిష్యులలోని పైలుడనే రుషి ప్రథముడు. వేద సమూహాన్ని నాలుగు భాగాలుగా విభజించి రుగ్వేదాన్ని పైలునికి బోధించి శిష్య పరంపర సహాయంతో వ్యాప్తి చేయమంటాడు వ్యాసుడు. ఆ సందర్భంలో పైలుడు పరమాత్ముని గురించి భిన్నమైన అనేక ప్రశ్నలు వేస్తూ – “వ్యాస మహాశయా! పరమాత్ముడంటే ఆత్మ పదార్థమన్నారు కదా? ఆ ఆత్మపదార్థాన్ని నిర్వచించగలమా?” అంటూ ప్రశ్నించాడు. అప్పుడు దైవం అంటే ఏమిటో వ్యాసుడు సవివరంగా వర్ణిస్తాడు.

నిజానికి భగవంతునికి ఏ పేరూ లేదు! ఎవరికి మనసైన పేరుతో వారు పిలుచుకోవచ్చు భక్తుడు తన పారమార్థిక తత్వంతో దైవంపై అనుబంధం ఏర్పరచుకొంటాడు. కోట్లాది భక్తులతో భగవంతునికి సంబంధాలు ఉన్నాయి కనుక ఆయన నామాలూ అసంఖ్యాకంగానే ఉంటాయి. ఒక గుణంతో, ఒక పేరుతో పరమాత్ముని  నిర్వచించలేం. వేదవ్యాసుని తండ్రి పరాశరుడు భవంతుణ్ణి –

ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస:శ్రియ:
జ్ఞాన వైరాగ్యయో శ్చైవషణ్ణాం భగ ఇతీంగన

(దేవాది దేవుడైన భగవంతుడు జ్ఞాన, బల, ఐశ్వర్య, కీర్తి, సౌందర్య వైరాగ్యాల నిధానం) అని నిర్వచించాడు. వ్యాసుడు పైలునితో భగవంతుని వర్ణిస్తూ, ఆత్మ పదార్థం నిర్వచనానికి అతీతం అన్నాడు. ఆ శక్తి ఎవరూ నిర్వచించలేని మనోమయాది గుణ విశిష్ట బ్రహ్మంగా భావించాలని సూచించాడు. బ్రహ్మానుభూతిని భక్తుడు అనుభవించగలడే కాని ఈ చక్షువులచే చూడటం తరంకానిది. పరబ్రహ్మం ఆవాజ్మానస గోచరమైనది. ఆ శక్తితో ఐక్యం చెందితేనే దైవంతో స్ముడవుతాడు. కాని పురాణ్, ఇతిహాసాల్లో ఎందరికో దైవం ప్రత్యక్షమైనట్లు చెబుతున్నాయి. ఎందరో దైవాన్ని తమకు ప్రియమైన, ఇష్టమైన భావంతో, రూపంగా జపించి తపించారు.  మానవుడు (భక్తుడు) పంచభూతాత్మకం కనుక ఈ భౌతిక జగత్తుకు, భౌతిక భావనకు అనుకూలంగా దైవం దర్శనమిస్తాడు.  కాని ఆ దర్శనమే పరమాత్మ కానేరదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు పార్థునికి వివరిస్తాడు.

పరస్తస్మాత్తు భావోన్యోవ్యక్తోవ్యక్తాత్ సనాతన:
యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి

(నేను భౌతిక, వ్యక్త అవ్యక్త పదార్థం కంటే అతీతమైనవాడిని. దైవత్వానికి మరోక ప్రకృతి ఉంది. అది పరమైంది. ఎన్నటికీ నశించనిది. ఈ విశ్వంతరాళాలన్నీ లయం చెందినా నశించని ప్రకృతి అది)

భవంతుడు తర్కానికి అందనివాడు.  పరమాత్మపై జిజ్ఞాస కలిగి, తెలుసుకోవాలనే  తపన ఏర్పడితే తనకన్నా అయంత అధికమైన జ్ఞానం కలవాడిని ఆశ్రయించి తెల్సుకోవాలి. అదే సులువైన ఉపాయం. పసివాడు తన తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే తన తల్లిని అడగడమే తప్ప మరో ఉపాయం లేదు. “అదిగో అయానే మీ తండ్రి” అని పసివానికి పరిచయం చేస్తుంది తల్లి. ఇక అప్పటి నుంచీ బాలుడు తండ్రిపై మమకారం పెంచుకొంటూ తండ్రి ద్వారా జ్ఞానసముపార్జన చేస్తాడు. దైవాన్ని గురించి వ్యాసుడిని ప్రశించి నిజానికి పైలుడు చేసిన ప్రయత్నం అదే.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s