దాంపత్య యజ్ఞం


లోకంలో సర్వసాధారణంగా కనిపిస్తున్న దాంపత్య జీవనం మన ఊహకు అందనంత పవిత్రమైనది. స్త్రీ పురుష సంబంధం కేవలం ఒక వేడుక కాదు. అదో పవిత్రమైన బాధ్యత. ప్రకృతిలో తమ తరవాతి తరాలు నిలబడేటందుకు మానవులు ఆచరించాల్సిన మహత్తర యజ్ఞం. ఈ యజ్ఞానికి ఉపకరణాలుగానే మానవులలో స్త్రీ పురుష భేదం, స్త్రీ పురుషుల్లో ఒకరి యెడల ఒకరికి చిత్రమైన ఆకర్షణ ప్రకృతి చేత కల్పితమయ్యాయి. సంతానాన్ని పొందేందుకు స్త్రీ పురుషులు ఆచరించే యజ్ఞంగా శతపథ బ్రాహ్మణం దాంపత్య జీవితాన్ని దర్శించింది. ‘అధిప్రజ’ మనే ఈ యజ్ఞభాగాన్ని ప్రాజాపత్య ధర్మమన్నారు.

వ్యాసభాగానుడు యజ్ఞవేదిక నుంచి ద్రౌపది ఉద్భవించిందని చెబుతారు. భౌతిక కక్ష్యలో జరిగిన వాస్తవమైన కథను శాశ్వత ధర్మ రూపంలో పొదిగారు. ద్రౌపదిని కామకర్మలో గాక యజ్ఞరూపమైన దాంపత్యకామ ధర్మంలో ఉద్భవింపజేసారు. జీవి ప్రవర్తన ధర్మానుబద్ధమై, సంస్కారపూర్వాకం అయినప్పుడు ఆ జీవితమే లోకహితార్థమైన పవిత్రయజ్ఞంగా రూపుదిద్దుకుంటుంది.  దాంపత్య ధర్మ పరిణామక్రమాన్ని, దాంపత్య ధర్మ స్వరూపాన్ని, పాతివ్రత్యధర్మ వైశిష్ట్యాన్నిమన ఇతిహాసాలు చక్కగా విశ్లేషించాయి. వివాహ వ్యవస్థ నెలకొన్న విధానాన్ని మానవుడు ప్రకృతి ప్రసాదించిన వివేకంతో దాంపత్య సౌఖ్యాన్ని ఎలా మలచుకున్నదీ రామాయణ, భారతాలు వివరిస్తున్నాయి.

దాంపత్య ధర్మమనేది మానవులు మాత్రమే కనిపెట్టినది కాదు. సృష్టిలో వృక్షజాలంలో, పశుపక్ష్యాదుల్లో సర్వత్రా వర్తించే ధర్మం. సజీవ దేహాలయ నిర్మాణానికి దాంపత్య ధర్మాన్ని ఉద్దేశించారు. కుటుంబం యజ్ఞశాల, యజమాని యాజ్ఞికుడు, ఆ యజమాని లోకహితంకోసం చేస్తున్న స్వధర్మాచరణమనే యజ్ఞానికి సహకరించేవారే భార్యాబిడ్డలు. ఆ యజ్ఞం నిర్విఘ్నంగా సాగినప్పుడే సాంఘీకవ్యవస్థ సమర్థంగా నిలబడుతుంది.

జరత్కారుడు ముని కుమారుడు. గృహస్థాశ్రమం మోక్షధర్మానికే ఆటంకంగా భావించేవాడు. ఒకసారి అరణ్యంలో చెట్టు కొమ్మలకు మునులు తలకిందులుగా వేలాడటం చూశాడు. ఒక ఎలుక చెట్టు వెళ్ళను కోరికేస్తోంది. జరత్కారుడు ఆ మునులను సమీపించి అది కూడా ఒక తపమేనని భావించి తనకూ ఉపదేశించమని కోరాడు. అప్పుడా మునులు తాము అతడి ముత్తాతలమని, అతడు భార్యను స్వీకరించి సంతతి పొందడానికి అయిష్టుడు కావడంవాల్ల కాలుడు మూషికమై కోరికేస్తున్నాడని తాము అధోలోకాలకు పడిపోతామని, అతడు వివాహం చేసుకుని సంతానం పొందితే ఊర్ధ్వగతుల్ని పొందగలమని పలికారు. జరత్కారుడు ఆ మాటలువిని చిత్తం కరుణారద్రమై సంతనారార్థమై వివాహానికి సిద్దమయ్యాడు. దాంపత్యధర్మం పవిత్రమైన భాధ్యతేగాని బరువుకాదని, దాని వాస్తవరూపాన్ని గ్రహించి ప్రవర్తిస్తే పరమార్థ సాధనకు సహకరిస్తుందని దర్శించాడు. దాంపత్యజీవనం భారతీయ సమాజానికి ప్రాకారం ఆ ధర్మంలో దృఢత్వాన్ని, దుర్భేద్యాన్ని రామాయణం చాటుతోంది.  సీతారాముల దాంపత్యజీవనంలోని వైలక్షణ్యాన్ని వివరిస్తూ విశ్వనాథవారు – సీత శ్రీరామచంద్రుని చిత్తపదం, రామచంద్రుడు జానకీ ప్రాణప్రదం, రామసర్ప ఫణామణి రమణి సీత, ధరణిజా జీవితాతప సరణిస్వామి’ అంటారు. దాంపత్యాన్ని ‘సుమానుషం’ అన్నారు భవభూతి ఉత్తర రామచరిత్ర నాటకంలో భవభూతి దాంపత్య అద్వైత భావనగా దర్శించారు.

అద్వైతం సుఖదు:ఖ యోరనుగతం…

‘ఏది సుఖదు:ఖాల్లో ఏక రూపంగా ఉంటుందో బాల్యయౌవనాది సర్వ దశల్లోనూ అనుగతమవుతుందో, పలువిధాలుగా బాధపడే హృదయానికి ఊరటగోల్పుతుందో, దేని మాధుర్యాన్ని వార్ధక్యం హరించలేదో, ఇంద్రియాలశక్తి తగ్గినా కొద్దీ ప్రేమ పెరుగుతుందో, కాలం గడిచిన కొద్దీ పరిణయం నుంచి మరణం వరకు ఏది మరింతగా పరిణామ పేశలమవుతుందో అట్టి దాంపత్యధర్మానికి భాద్రమగుగాక’  అంటారు కవి. అందుకే దాంపత్య జీవనాయజ్ఞం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s