ధర్మజ్యోతి


ప్రపంచంలో అనేక ధర్మాలు వర్థిల్లుతున్నాయి. పరంజ్యోతి నుంచి వెలుగును అందిపుచ్చుకున్న ధర్మ జ్యోతులివి. ఆ వెలుగులో పయనించే జీవుడు ఆ పరంజ్యోతి వైపే వెళ్ళగలుగుతాడు.
రాత్రంతా చీకట్లో వెలిగే నక్షత్రాలు, అజ్ఞానానికి వీడ్కోలు గీతాలు పాడి, ఉదయ రాగాలతో ఉద్భవించే ఆదిత్యునికి స్వాగతం పలికినట్లే ధర్మాలన్నీ అజ్ఞానాన్ని నిరసిస్తూ, జ్ఞానజ్యోతిని ఆహ్వానిస్తాయి.  అతి ప్రాచీన ధర్మాల్లో జైనధర్మం ఒకటి. ధర్మాన్ని మతంగా పలకడం ఆనవాయితీ.జైనమతంలో 24 మంది తీర్థంకరులు (మత ప్రవక్తలు) ఆవిర్భవించారు. 23వ తీర్థంకరుడు పార్శ్వ నాథుడు, 24వ  తీర్థంకరుడు మహావీరుడు.  జైనధర్మం ‘ అహింసా పరమో ధర్మ: ‘ అని చాటిన తొలి మతం. క్రీ.పూ. అయిదో శతాబ్దానికే జైనధర్మం వ్యాప్తిలో ఉంది.

‘ జినుడు ‘ అంటే జయించేవాడు. తనలోని అంత:  శత్రువులను వీరోచితంగా జయించాడు గనుక ఆయన మహావీర జైనుడు అయ్యాడు. క్షత్రియ కుండపూర్ మహారాజు సిద్ధార్థ, త్రిశలాదేవి దంపతులకు మహావీరుడు ద్వితీయ పుత్ర్డుగా జన్మించాడు. గర్భస్థుడుగా ఉన్నకాలంలోనే,  తనకదలికల వల్ల తల్లికి కష్టం కలుగుతునేమోనని స్థిరంగా ఉన్న అహింసామూర్తి.

శిశువుగానే ఆయన మందస్మితుడై , మౌనగంభీరంగా, ఇతర శిశువులకు భిన్నంగా ప్రవర్తించేవాడు. చైత్రశుక్ల త్రయోదశినాడు చంద్రయోగంలో మధ్యరాత్రి గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న వేళ ఉదయించిన మహావీరుడు, సహజ బ్రహ్మజ్ఞానికావడం వల్ల, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా భొధించిన శాస్త్రమంటూ ఏమీ లేకుండానే, సకల శాస్త్రపారంగతుడయ్యాడు.  కొంతకాలంపాటు తల్లిదండ్రులు, సోదరుల సంతోషంకోసం రాజమహల్లో నివసించినా, చివరకు పెద్దల అనుమతితో  హేమంతరుతువు, బహుళ దశమినాడు సర్వమూ త్యాగంచేసి ఆధ్యామిక ప్రపంచంలోకి ‘ మహాభి నిష్క్రమణం ‘ ద్వారా అడుగుపెట్టడు. ఆయన అనంతయాత్ర ఆరంభమైంది.

తన ఆధ్యాత్మిక యాత్రలో జైన మహావీరుడు కొన్ని వేల మందిని అహింస మర్గంలోకి మళ్ళించగలిగాడు. ఆనాటి సమాజంలో దాస దాసీల వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలిచి వేయడానికి కారణభూతుడయ్యాడు.
ఆయన ధర్మబోధ విశిస్టంగా, విలక్షణంగా ఉండేది. సమత్వానికి ఆయన ఆత్యధిక ప్రాధాన్యమిచ్చేవారు.

రాయబంధం పదోసచ హరిసం దీణభావయ!
ఉస్సుగత్తం భయం సోగం, రదిమర దించవో సరే
– సమత్వాన్ని సాధించటానికే నేను రాగాన్ని, ద్వేషాన్ని, ప్రసన్నత్వాని, దీనత్వాన్ని, ఉత్సుకతనీ, భయన్ని, శోకన్ని, విషాదాన్ని, ఆనందాన్ని పరిత్యజిస్తాను.

దోహిం అంగేహిం ఉప్పేలితేహిం ఆతా సజ్జణ ఉత్పీలతీ!
రాగంగేయ దోసేయ, సేహు సమ్మం ణియచ్ఛతి
– ఎవరి ఆత్మ రాగద్వేషాల బాధతో విచలితం కాదో, అతదే సరైన నిర్ణయం తీసుకోనగలడు.

ఇవి ఆయన బోధల్లో కొన్ని.
కామక్రోధాలు, రాగద్వేషాలు, అనే ఆంతశ్శత్రువుల్ని  జయించిన వ్యక్తిని ‘ అరిహంతుడు ‘ అంటారు.

వర్థమానుడు – అనగార్ (ముని) ధర్మం, సాగార (గృహ్స్థ) ధర్మం రెండూ ‘అ హింస ‘ అనే మూల ధర్మానికి అనుసంధించి ఉన్నంతవరకూ అవి ఉత్తమమైనవే చెప్పాడు.

జైన ధర్మ  సంఘంలో స్త్రీలకు, అన్నికులాల వారికి, రాజులకు, పేదలకు – సమత్వం దీక్ష ఇచ్చేవారు. వారిని ప్రవ్రజితులనేవారు. విద్య, శీలం, సచ్చరిత్ర తప్ప –  గోత్రాలు, జాతికులాలకు మోక్షమార్గంలో ప్రవేశంలేదనేది ఆయన సందేశం.

జైన ధర్మం ఒక అహింసా జ్యోతి. ఆ వెలుగు పడిన చోట అశాంతికి తావులేదు. అహింస వెలుగులో అంతశ్శత్రువులు అంతమొందుతారు. జీవికి అంతకన్న మోక్షం మరేముంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s