వ్యాస పౌర్ణిమ


వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే: పౌత్రమకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం

వసిష్ఠుని మునిమనవడు, శక్తి మనుమడు, పరాశరుని కుమారుడు, శుకుని తనది, తపోనిధి అయిన వ్యాసునికి నమస్కారం అని పై శ్లోక భావం. వ్యాసుని తండ్రి తాత ముత్తాతలతో పాటు అయన కుమారుడు శుకుని కూడా స్మరించుట గమనార్హం. వేదవిభజనతో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణుమూర్తిపై భక్తి ప్రధానంగా ముగించిన భాగవత రచన ధర్మాధర్మ వివేచనకు ప్రాధాన్యమొసగి అంతమొందింది. నిశ్చల తపోధనుడైన శుకుని పుత్రునిగా పొందటంతో వ్యాసుని ఆధ్యాత్మిక వ్యక్తిత్వం సంపూర్ణత సంతరించుకొంది. అంతిమలక్ష్యం మోక్షంగా ధర్మ ఉపకరించే సాధనమే గాని వేరుగాదు.

ద్వాపరయుగంలో పరాశర సత్యవతులకు జన్మించిన పుత్రుడు వ్యాసుడు. నారాయణునికి జన్మించిన మానస పుత్రుడు. అతని అసలు పేరు అపాంతరతముడనగా లోపల నున్న చీకటిని (అజ్ఞానాన్ని) పోగొట్టుకొనినవాడు అని అర్థం. బ్రహ్మముఖం నుండి వెలువడిన వేదాలను శ్రద్ధగా విని విభాజించుమని నారాయణుని ఆదేశం. ఎంతో నేర్పుగా బాగుగా నెరవేర్చిన వేదవిభాజనకు మెచ్చి అతనికి వేదవ్యాసుడనే బిరుదును బహుకరించాడు. బిరుడులోనే పదవీ గౌరవం సూచితమైంది. ప్రతి ద్వాపరయుగంలోనూ వేదవిభజన జరుగుతూనే ఉంటుంది. ప్రథమ ద్వాపరంలో స్వయంభువు; ద్వితీయ ద్వాపరంలో ప్రజాపతి; తృతీయ ద్వాపరంలో శుక్రుడు; ఆ తర్వాత బృహస్పతి; వసిష్ఠుడు, త్రివర్షుడు మొదలుగువారు వ్యాస పదవిని అలంకరించారు. చివరి ద్వాపరంలో కృష్ణ ద్వైపాయనుడు తన శిష్యులైన పైలుడు, జైమిని, సుమంతుడు, వైశంపాయనుల ద్వారా వేదాలను ప్రపంచంలోని వారందరికీ అందించాడు. బ్రహ్మాండపురాణంలో వ్యాసపూర్ణిమ ప్రాముఖ్యతను తెలియచేసే కథను నారదుడు వైశంపాయనునికి చెప్పాడు.

పూర్వం కాశీపట్టణంలో వేదనిధి, వేదవతియను నిరుపేద దంపతులుండేవారు. ఎంతకాలానికి వాళ్లకు సంతానం కలగక పోవడం వల్ల వాళ్ళు వ్యాసమహర్షి స్నానం నిమిత్తమై గంగానదికి వచ్చినప్పుడు, ఆ మహర్షిని దర్శించుకొని, పాదాక్రాంతులయ్యారు. వ్యాసమహర్షి ఎండ కోర్వలేని వారిని చూచి మెచ్చుకొని ‘ఏమి కావాలి’ అని అడిగారు. అందుకు వారు రేపటిరోజు తన తండ్రి శ్రాద్ధకర్మ అనీ, అందుకు బ్రాహ్మణునిగా వ్యాసమహర్షిని రమ్మనీ వేదినిధి కోరగా, తానూ వ్యాసుదానని ఎవరిదీ తెలియనివ్వక రహస్యంగా నుంచు మనే అంగీకారంపై వస్తానని తెలిపాడు. వేదనిధి దంపతులు, శుచిగా రుచిగా చేసిన వంటకాలన్నీ ఆరగించి, భిక్షుక వేషంలోనున్న వ్యాసుడు వారి భక్తికి మెచ్చి, వారికి సకల సద్గుణ సంపన్నులు, ఐశ్వర్య వంతులు అయిన పదిమంది కుమారులు కలుగుతారని దీవించాడు. అలాగే ఆషాడశుద్ధపౌర్ణమి రోజు వ్యాసపూజ జరిపే పురోహితులందరూ తన ప్రతిరూపాలేనంటూ; యథాశక్తి వారిని గౌరవించిన తనయనుగ్రహము తప్పక లభిస్తుంది అని వ్యాసుల వారు వేదనిధికి చెప్పారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s