వృక్షో రక్షతి రక్షితః


చెట్లను మనం కాపాడితే అవి మనలను కాపాడతాయని మన పెద్దలవాక్కు. అందుకే ‘వృక్షో రక్షతి రక్షితః’ అని అన్నారు. మన సంస్కృతీ ప్రకృతితో మమేకమైనది. మన పూజావిధానాలను పరిశీలించితే, లేక పురాణాలను పఠించితే ప్రకృతికీ మనకు మధ్య గల అవినాభావ సంబంధాన్ని తేటతెల్లం చేసే విదానంగానే ఉంటుంది.

ఉదాహరణకు మన పురాణాలనే తీసుకుందాం. అడవులు కూడ నివాసయోగ్యాలుగానే చిత్రీకరించబడ్డాయి. ఋషులు తమ ఆశ్రమాలను అటవీప్రాంతాలలోనే నిర్మించుకున్నారు. శ్రీరాముడు. ధర్మరాజు వంటి వారు అష్టైశ్వర్యాలను త్వజించి వెళ్ళింది అడవులకే. ఈ నేపధ్యంలో మన పురాణాల్లో నైమిశారణ్యం, దండకారణ్యం, తాతకవనం, ఖాండవవనం, హిండింబవనం వంటి అరణ్యప్రాంతాలను చూడగలం. ఒక్కొక్క వనానికి ఒక్కొక్క ప్రత్యేక చరిత్ర ఉంది. ఆయా వనాలలో నున్న చెట్లను గురించి, ఆ చెట్ల యొక్క ఔషధ గుణాలను గురించి ఆయా పురాణాలలో విపులీకరించబడింది.

నైమిశారణ్యం

మన పూర్వీకులకు ప్రకృతి పట్ల, వృక్ష, జంటజాలాల పట్ల ఎనలేని అభిమానం. ఆరోజుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన అటవీప్రాంతం నైమిశారణ్యం. ఇక్కడే సప్తఋషులు వేదాలను వల్లించారు. ఈ వనంలోనే వాల్మీకి మహర్షి రామాయణ గ్రంథానికి రూపకల్పన చేసాడు. వినాయకుడు రాస్తుండగా, వ్యాసమహర్షి మహా భారతాన్ని చెప్పింది నైమిశారణ్యంలోనే, భాగవతం కూడా చెప్పబడింది ఇక్కడే. ఇక్కడే సూట మహర్షి భాగవత గాథను చెప్పాడు. అందుకే నైమిశారణ్యంలోని ప్రతి చెట్టు యొక్క ఆకులు భాగవత శ్లోకాలను వల్లించుతాయని ప్రతీతి.

“మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రకృతికి మనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి వివరంగా చెబుతుంటాయి. ‘ఓషధిభ్యాః అన్నమ్, అన్నాత్ పురుషాః’ అని త్తెత్తీరీయోపనిషత్ చెబుతోంది. అంటే, అన్నం నుంచి పురుషుడు అంటే జీవుడు పుట్టి, తనకు కావలసిన ఆహారాన్ని మొక్కలు, చెట్ల నుంచి గ్రహిస్తున్నాడని అర్థం. ఈ నేపథ్యంలో మన పురాణాలను పరికించినపుడు, మనవాళ్ళు ప్రకృతినే పరమాత్మగఅ కొలుచుకుంటున్న విషయం తేటతెల్లమవుతుంది.”

అసలు నైమిసారణ్యాన్ని విష్ణుమూర్తి ఒక నిముష మాత్రములో తన సంకల్పమాత్రం చేత ఈ అరణ్యాన్ని సృష్టించాడని కథనం. ఈ అరణ్యంలోనుంచి ప్రవహిస్తున్న గోమతీ నది అనేక మూలికలతో కూడుకుని ఉంటుందట. ఈ నదిని ఆదిగంగ అని పిలుస్తుంటారు. శ్రీరామచంద్రుడు ఇక్కడ తన పితృదేవతలకు పూజలు చేసాడట. వృతాసురుని సంహరించేందుకు ఈ నైమిశారణ్యంలోనే దధీచి తమ ఎముకులను వజ్రాయుధం తయారీకోసం బహుకరించాడు. ఇలా నైమిశారణ్యం మన పురాణాలలో గోచరిస్తుంటుంది.

దండకారణ్యం

శ్రీరాముడు వనవాసాన్ని చేయడానికి సంకల్పించినప్పుడు, ఆయన వెళ్ళాలనుకున్నది దండకారణ్యానికే. ఈ అడవిలోనే సీతారామలక్ష్మణులు ఎక్కువ వనవాస సమయాన్ని గడిపారు. సీతారామదంపతులకు అడవిలో జీవనాన్ని ఎలా గడపాలన్న విషయాలను అత్రిమహర్షి – అనసూయాదేవిలు తెలిపారట. ఇక్కడ ఐదు వృక్షాల మధ్య లక్ష్మణునిచే నిర్మించబడిన  ‘పంచవటి’ సీతారాములకు స్వర్గం కంటే విలువైనది.

అయితే ఈ దండకారణ్యం ఓ పాపాత్ముని వలన ఏర్పడినదని ఉత్తర రామాయణం ద్వారా మనకు తెలుస్తోంది. పూర్వం ఇక్ష్వాకుని పుత్రులలో దండుడు అనే కడపటి కొడుకు ఉండేవాడు. దండుడు చిన్నప్పట్నుంచి కడు దుర్మార్గుడు. తన బాల్యంలో అనేకమంది బాల్యమిత్రులను చంపుతుండేవాడు. అతని ఆగడాలను భరించలేకపోయిన ఇక్ష్వాకుడు దండుని వింధ్యపర్వతాల అవతలకు తరిమేశాడు. అక్కడికి వెళ్ళిన దండుడు మధుమంతపురం అనే నగరాన్నినిర్మించి పరిపాలన చేయసాగాడు. అనంతర కాలంలో శుక్రుని వద్ద శిష్యకరం చేసిన దండుడు, ఒకరోజు శుక్రుని కూతురు అరజను బలాత్కరించాడు. అరజతను గురువు కూతుర్ని కనుక, అతనికి చెల్లెలి వరుస అవుతానని, ఇటువంటి దుర్మార్గం తగదని బ్రతిమాలుకున్నప్పటికీ, దండుని అకృత్యం ఆగలేదు. ఈ వార్తను విన్న శుక్రుడు ఆగ్రహంతో దండుడు రాజ్యంపై మట్టి వాన కురిసి, అతని రాజ్యమంతా భూస్తాపితమైపోవాలని శపించాడు. వెంటనే మధురమంతపుర రాజ్యం మట్టి వర్షంలో మునిగిపోయి, కొంతకాలం తర్వాత ఆ మట్టిపై దట్టమైన అడవి ఏర్పడి దండుని పేర దండకారణ్యం అని పిలువబడింది. కాబట్టి ఇక్కడ మనకు ఓ విషయం స్పష్టమవుతోంది. ఋషులు ఓ దుర్మార్గుని శపిస్తున్న సమయములో కూడ ఆ శాపం ప్రకృతికి పరిరక్షణకు అనుకూలంగా ఉండేట్లుగా చూసుకున్నారన్నవిషయాన్ని మానమ గ్రహించాలి.

తాటకవనం

రామాయణంలో దండకారణ్యంతో పాటు మరో ప్రసిద్ధమైన వనం ఉండేది. అదే తాటకవనం. పూర్వం తాటక అనే రాక్షసి అడవిలో తనకు కనబడిన మనుషులను తింటూ, ఆ అడవినంతా ధ్వంసం చేస్తుండేది. చివరకు ఆ రాక్షసి విశ్వామిత్రుడు దశరథుని అనుమతితో బాల రామలక్ష్మణలను ఆశ్రమానికి తీసుకెళ్తుండగా, తాటక ఎదురైంది. అలా తనకు ఎదురుపడిన తాటకను బాలరాముడు ఒక్క బాణంతో సంహరించాడు. అప్పుడా రాక్షసి శాపవిమోచనం పొంది, గాంధర్వకన్యగా మారిపోతుంది. తానూ అగస్త్యుని వలన శాపానికి గురైయ్యానని, తనకు శ్రీరాముని వలన శాపవిమోచనం కలిగినందుకు జన్మ సాఫల్యమైందనిచెబుతూ, తన లోకానికి వెళ్ళిపోతుంది.

ఇక మహాభారతం, భాగవతంలో కూడ అనేక అరణ్యాల ప్రసక్తులు ఉన్నాయి.

3 comments on “వృక్షో రక్షతి రక్షితః

 1. rathnamsjcc says:

  ప్రతి వ్యక్తి ఈ భౌతిక శరీర రూపి రధం పైన ఆరూధుడై ఉన్నాడు. బుద్ధి ఇతని సారధి, మనసు కళ్ళెం, ఇంద్రియాలు గుర్రాలు, ఈ రకంగా మనస్సు ఇంద్రియాలు, సాంగత్యం తో ఈ ఆత్మ సుఖం లేక దుఖం అనుభవిస్తాడు. ఈ విధంగా పెద్ద పెద్ద చింతకుల విశ్లేషణ. శరీరము లో . 24. ఇరవై నాలుగు తత్వాలతో కలిసి మాయఓ మనసా! • మాయ తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడుశరీరము లో మనస్సు,బుద్ధి, చిత్తం, అహంకారం ఆత్మ .అంటారు

 2. athnam.sjcc says:

  మానవునికి స్థూల, శరీరమై ఉంది. సూక్ష్మము..మీ మనసు పసిపాపలా శుద్దమైనప్పుడే మీకా అర్హత పరమాత్మకలిపిస్తాడు.మీరుసూక్షశరీరంతోప్రయాణాలు.మొదలుపెట్టినప్పుడు,ఎల్లలెరుగని,రోడ్లు,భవనాలదగ్గరకు,అవసరంలేని.అంతర్జాతీయ.ప్రయాణాలకు,సముద్రాలు,ఆకాశంమీదకుతిరిగిరావచ్చు.మీస్నేహితుల్ని,బంధువుల్ని,మీ ప్రియమైన వారిని చూసి రావచ్చు.సూక్షలోకాల్లో ఎక్కడెక్కడో విహారించి రావచ్చు. మీరు ఎక్కడెక్కడికి ఎంతెంత దూరలకు పోయినా మీ ఈ మనస్సు,నిలిపి కనురెప్పపాట్లు సూక్ష్మాతి సూక్ష్మ చైతన్య మైన ప్రయాణాలు అందరు చేయగలిగే సూక్ష్మ చైతన్య శక్తితో ఉండేవారు.కాని ఆ శక్తిని దుర్వినియోగం చేయడం వలన ,మనుషుల నుండి ఆ శక్తులు ఉపసంహరించుకోబడ్డాయి…మీరు ఒక సారి సూక్ష్మాతి సూక్ష ప్రయాణం చేయడం మొదలు పెడితే మీకు అన్ని విషయాలు అవే అర్థం అవుతాయి. సూక్ష్మ చైతన్య సాధన మొదలుపెట్టండి. మీ సాధన పలించిన రోజున మీకు సూక్ష చైతన్య ప్రయాణం చేసే శక్తి వచ్చింది.ఆ తరువాత ఏం జరుగుతుంది?మీ భౌతిక శరీరం నుండి సూక్ష్మ చైతన్య శక్తి బయటపడి తలతిప్పి పక్కకు చూస్తే ఒక్క సారిగి భయపడేంతా పని జరుగుతుంది. మీ భౌతిక శరీరాన్ని అద్దంలో నుండి చూసినట్లుగా కాకుండా మరోకరిగా మిమ్మల్ని మీరే ఓ కళేబరంలా మీరు మొదటి సారిగా చూడడం నిజంగా భయపడే విషయమే.మీ జీవితంలో ఏనాటికి నమ్మలేని విషయాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు,కాబట్టి నమ్మక తప్పదు.కాని భయపడితే మాత్రం మీరు ఎంతో సాధనతోని పొందిన సూక్షశరీరం వెంటనే మీ భౌతిక శరీరంలో దూరిపోతుంది.బయపడకుండా ముందే సిద్దంగా ఉండండి.మీ సాధన స్థిరత్వం పొందిన తరువాత,మీరు ఏ రోజు కావాలంటే ఆరోజు సూక్షశరీరంతో బయటకు వచ్చిన రోజున

 3. rathnamsjcc says:

  మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె తారక బ్రహ్మo
  హృదయమే మనసుకి మూలస్ధానం. ఇది మనసుయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో.నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి ,
  ఈ ఆత్మకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి
  మదిని నిగ్రహించుట మనసు నిలిపి తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మాత్రం మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది మనసు నిలిపి లగ్నమై ఉంటుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s