వేదాలు నాలుగు కదా! ఆయుర్వేదం ఏమిటి?


ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం ఈ నాలుగు వేదాలు.

కృతయుగంలో దేవతలు రాక్షసులు ఒకటిగా చేరి క్షీరసాగర మధనం. ఆ సాగరమధనం నుండి శ్రీమహాలక్ష్మీ, కౌస్తుభామణి, ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు, దివ్యరత్నరాశులు. ఉచ్చైశ్శ్రవము, అమృతము పుట్టాయి. అన్నికంటే ముందుగా పుట్టింది హాలాహలం. అమృతంతో తరువాత ‘ధన్వంతరి’ జన్మించాడు. ఈయనను మహావిష్ణువు అవతారంగా భావిస్తారు. ధన్వంతరి జన్మిస్తూనే ఒక చేతిలో అమృతభాండాన్ని మరొక చేత ఆయుర్వేదాన్ని, పట్టుకొని ప్రత్యక్షమై వచ్చారు. ఈ ఆయుర్వేదమే సకల మానవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే జీవనవేదం. ఈ ఆయుర్వేదాన్ని అధర్వణవేదానికి ఉపవేదంగా చెబుతారు.

శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన ధర్వంతిరియే రోగ మరణభయంలేని అమృతాన్ని దేవతలకు యిచ్చి అజరామరులుగా చేసాడు. పంచమవేదంగా ఆయుర్వేద భండారాన్ని బ్రహ్మదేవునికి ఇచ్చాడు శ్రీధన్వంతరి.

ఈ ఆయుర్వేదం బ్రహ్మదేవుని నుండి దక్షప్రజాపతికి లభించింది. దక్ష ప్రజాపతినుండి సురలోక వైద్యులైన అశ్వినీ కుమారులకు సంక్రమించింది.

ఈ ఆయుర్వేదం భూలోకానికి ఎలా వచ్చిందంటే:

ఒకసారి వసిష్ఠ, భరద్వాజ, అంగీరస, అత్రి, దుర్వాస, భృగు, విశ్వామిత్రాది మహర్షులందరూ హిమవత్పర్వతంమీద సమావేశమైనపుడు, మానవాళి రోగాల బారినపడి నిశ్శేషమైపోతున్న విషయం చర్చకు వచ్చింది. దేవలోకంనుండి ఆయుర్వేదాన్ని భూలోకానికి రప్పించాలని అందరూ నిశ్చయించుకొన్నారు. భరద్వాజ మహర్షి దేవలోకం వెళ్ళి ఆయుర్వేదాన్ని అభ్యసించి వచ్చి ‘ఆత్రేయుడు’ అనే మహర్షికి బోధించాడు. ఈ మహర్షి తదనంతరం అగ్నివేశ మహర్షికి ఉపదేశం చేసాడు. ఆత్రేయునివద్ద నేర్చుకొన్న ఆయుర్వేద రహస్యాలను మహా శాస్త్రంగా రచించాడు అగ్నివేశుడు. దీనినే “అగ్నివేశతంత్రం” అంటారు. ఈ అగ్నివేశతంత్రం క్రీపు.2000-1000 “చరకసంహిత” గా రూపుదిద్దుకొంది. ఈ చరకుదినే మన ఆయుర్వేదానికి ఆదిగురువుగా ఇపుడు పూజిస్తున్నాం.

శ్లో|| నమామి ధన్వంతిరి మాదిదేవం, సురాసురైర్వందిత పాదపద్మం
      లోకేజరారుగ్భయ మృత్యునాశం, ధాతారమీశం వివిధౌషదీనాం

Advertisements

4 comments on “వేదాలు నాలుగు కదా! ఆయుర్వేదం ఏమిటి?

 1. Satya Sai Vissa says:

  మీ కృషి బహుదా ప్రశంసనీయమ్ ..అభినందనీయమ్..మన దైన ఘన సంస్కృతి లోని అంశాలను కరతలామలముకా అందిస్తున్న మీ సనాతన ధర్మ, సంస్కృతి సాంప్రదాయ భక్తి విషయాలు పరిరక్షణా కాంక్షకు మీ అవిరళ దీక్షకు శతసహస్ర వందనాలు మీ అద్భుత వ్యాసాలను పదిమందికి పంచేందుకు (share) అనుమతికోరుతున్నాను.

 2. మీ వాఖ్యలకు ధన్యవాములు..చాల సంతోషం…నా బ్లాగులోని విషయాలను మీరు పదిమందికి పంచుతాను అన్నందుకు.

 3. Hanumantha Rao says:

  sulabhamga andarikee artham ayyetlu vivarincharu. chaalaa bagundi mee vivarana.

 4. Kalli Prasad Mullapudi says:

  Nicely narrated..
  Thanks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s