అరుదైన వ్రతాలు!


(మహిళల సౌభాగ్యం కలకాలం వర్థిల్లేందుకు…)

ధనుర్మాసవ్రతం (డిసెంబర్ 16వ తేది మొదలు జనవరి 13 వరకు)

ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండురాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే “ధనుర్మాసం” ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంతే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు (భోగి) వరకు ఉంటుంది. ఈ నెలరోజుల పాటూ ‘ధనుర్మాసవ్రతం’ ఆచరించాలి. 

ధనుర్మాసవ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారదమహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాసవ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణసంహితలో కనిపిస్తుంది.

వ్రత విధానం

వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తిమేరకు పంచలోహాలతో గాని, రాగితోగాని శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారు చేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. విష్ణువును ‘మధుసూధనుడు’ అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతిరోజూ సూర్యోదయానికంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవుపాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకొరకు శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శఖంలో అభిషేక ద్రవాలను ఒక్కొక్కదానినే నింపుకుని, శంఖంతో అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతో గానీ, సహస్రనామాలతో గానీ పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ ‘చక్కరపొంగలి’నిగానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన ‘పులగం’నుగానీ సమర్పించాలి. తర్వాత పదిహేనురోజులూ “దద్ద్యోదనం’ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూపదీప, దక్షిణతాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించడం చేయాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణు గాథలను చదువుతూగానీ వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈవిధంగా ప్రతిరోజూ ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజులపాటు చేయలేనివారు 15 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్క రోజు అయినా ఆచరించాలని శాస్త్రవచనం.

వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని –

“మధుసూధన దేవేశ ధనుర్మాస ఫలపరద
తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||”

అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి.

పండితుడు డాన్ని స్వీకరిస్తూ –

“ఇందిరా ప్రతి గృహ్ణతు” అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరమలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాలపాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితాభిప్రాయం.

కాత్యాయనీ వ్రతం (డిసెంబర్ 16 తేది మొదలు జనవరి 13 వరకు)

ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలూ ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.

వ్రత విధానం

ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుఝామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరచి పేడనీతితో కళ్ళాపి జల్లాలి. బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర చామంతి, బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి. 

తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరు పడిన ఈ కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడనే శాస్త్రవచనం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s