సకలదేవతా శక్తి స్వరూపిణి…


నవరాత్రులకే దసరాపండుగలని పేరు. విజయ దశమితో కూడిన నవరాత్రులను, దశరాత్రులను దసరా పండుగలని అంటారు. ఏకరాత్రి, ద్విరాత్రి, త్రిరాత్రి…ఇలా ఒకరాత్రిగాని, రెండురాత్రులు, మూడు ఇలా ఐదు, ఏడు రాత్రుల అమ్మవారికి ఆరాధన చేసినప్పటికీ, ఆ ఆరాధనకు నవరాత్రి వ్రతమని పేరు. రాత్రికి, రోజు తిథి, మాసం మొదలగు అర్థములు గలవు.

“రాత్రి రూపా మహేశాని దివారూపో మహేశ్వరః”

పార్వతీదేవి రాత్రి అని, పరమశివుడు పగలని అర్థం.

“నవో నవోభవతి జాయమానో” అనే మంత్రంలో పరమేశ్వరుడు “నవః” అని కీర్తింపబడుతున్నాడు.

“ఇంద్రః నవీయాన్, నవతరః కల్యాణః స్తుత్యః”

నవ అనగా తొమ్మిది అనే కాక నిత్యనూతనుడు, కళ్యాణమూర్తి, స్తుతింపదగినవాడని అర్థం.

దేవీశక్తి నిండివున్న మనదేశాన్ని, ఈ నేలని “మాతృభూమి”గా మనం భావిస్తాము. పంటలు మారే సమయంలో దేవి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకే సంవత్సరంలో రెండు నవరాత్రులు గుప్తంగా, రెండు నవరాత్రులు బహిరంగంగా, మొత్తం నాలుగుసార్లు నవరాత్రి పూజలు నిర్వహిస్తారు.

  1. చైత్రమాసం పాడ్యమి మొదలు వసంత నవరాత్రులు (పంటల సమయం)
  2. ఆషాడ శుక్ష పాడ్యమి
  3. మాఘశుక్ష పాడ్యమి
  4. ఆశ్వయుజ శుక్షపాడ్యమి (శరన్నవరాత్రులు)

ఆషాడ, మాఘమాసాల నవరాత్రులను “గుప్తరాత్రులని” అంటారు. చైత్ర, ఆశ్వయుజ నవరాత్రులు “ప్రత్యక్ష నవరాత్రులు”గా వ్యవహరిస్తారు. సాధారణంగా జనసామాన్యం నవరాత్రుల్లో దేవీపూజ చేయడం ఆనవాయితీ.

నవరాత్రుల గురించి తైత్తిరీయ బ్రాహ్మణమ్ ఇలా చెబుతోంది. శిశువు తల్లి గర్భమున తొమ్మిది నెలలుండి, తొమ్మిది అవతారములు (పిండము, కలలం, బుద్భదం….వగైరా) ధరించి పదవనెలలో (దశమాసంలో) విజయుడై జన్మిస్తోంది. ఆ శిశువు విజయదశమీ స్వరూపుడిగా కీర్తింపబడుతోంది. దశమాసంలో శిశువు యొక్క జననమే విజయదశమీ పండుగ.

భగవతిఅవతారాలను నవరాత్రుల్లో తొమ్మిదిరోజులూ భక్తిభావంతో అర్చిస్తారు. తొమ్మిదిరోజుల తరువాత దశమి (విజయదశమి) రోజున –

  1. దేవేంద్రుడు వృత్తాసురుని జయించి, సంహారించాడు.
  2. శ్రీరామచంద్రుడు ఈ రోజునే రావణాసురుని జయించాడు.
  3. మహాభారత యుద్ధం ఈరోజే ప్రారంభమైంది.
  4. అసురసంహారం చేసిన దుర్గాదేవి, ఈరోజు కైలాస శిఖరానికి వెళ్ళిపోయింది. అందుచేత ప్రజలు దుర్గాదేవి ప్రతిమని వైభవంగా ఊరేగించి పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తారు.
  5. నవరాత్రుల్లో రామలీలాప్రదర్శన చేస్తారు. వారణాసిలో విజయదశమి రోజున రామలీలా ఉత్సవాలు నిర్వహిస్తారు.
  6. వాస్తవానికి నవరాత్రులనేవి ఆత్మశుద్ధి పర్వం.

ఆ తల్లి సకలదేవతా శక్తి స్వరూపిణి, మనలను కాపాడుతుంటుంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s