వేదాంగములు


1. శిక్ష: వేదములందలి అక్షరములను, స్వరములను ఉచ్చరించు రీతిని వవరించి చెప్పును. దీనిని పాణిని రచించెను.

2. వ్యాకరణము: సుశబ్ద, అపశబ్దముల భోధించును. దీనిని గూడ పాణినియే రచించెను. ఇది ఆధునిక భాషా శాస్త్రము లకు మూలము. ఇందు 8 అధ్యాయములు కలవు.

3. ఛందస్సు: పింగళుడు. ఛందోవిచితి అనబడు 8 అధ్యాయముల ఛందో శాస్త్రము రచించెను. మంత్ర ములందుగల వౄత్తివిశేషములు బోధించెను.

4. నిరుక్తము: వేదమంత్రములందుగల కఠినపదముల భావమును బోధించును. దీనిని యాస్కుడు రచించెను.

5. జ్యోతిషము: ఇది కాలనియమమును బోధించు శాస్త్రము. లగధుడు, గర్గుడు మొదలగువారు రచించిరి. ఇది ఆయా కాలములందు చేయవలసిన యజ్ణ్జ యాగాది విధులకు సంబంధించిన కాలవిశేషము లను బోధించును.

6. కల్పము: ఇది ఆయా మంత్రములు పఠిచుచు చేయ వలసిన కార్యములను బోధించును. అశ్యాలాయనుడు, సాంఖ్యాయనుడు మున్నగువారీ శాస్త్రమును రచించిరి.

3 comments on “వేదాంగములు

  1. rathnamsjcc says:

    భక్తి విషయాలు
    నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి అవిభాజ్యం, అఖండం. నీ పరిధిలో నీవు నిశ్చలుడవై నిలువనేర్చుకో. ఆ నేను స్త్రీయా, పురుషుడా? ఆ నేనుకు వయస్సెంత? శరీరంలో నేననునది ఏ భాగము. శరీరము నేనుకాదు. శరీర నిలుకడకు ఆధారముగ నేనున్నానని తెలుసుకో. ఈ ఆత్మ నేనుకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ స్ధితిలో సైతం ఈ నేను అవిచ్చిన్నముగ భాసిల్లుచున్నది. ఇట్టి నేను పరిజ్ఞానమే పరలోక దైవరాజ్య ప్రవేశం. మీలో ఎందరు ఈ పరిజ్ఞాన మును కలిగియున్నారో పరీక్షించుకోండి. జీవాత్మ నేనుకు హృదయ మందిరమే సరియైన ఆలయం. ఈ లోకంలో నిర్మించిన దేవాలయములన్నియు ను బాహ్యవేడుకేలు మాత్రమే. సమస్త యాత్రలకు మూలం నేను అని తెలుసుకో. నీవు లేకుండ, నీవు పోకుండ ఏ యాత్రలు వర్ధిల్లనేరవు. నీతో సర్వం ఏకీభవించి యున్నదని రూఢిపరచుకో. ఈశ్వరునివలె జీవుడుకూడ శుద్ధ చిన్మాత్రుడేగాన బేధంలేదు. మమాత్మా సర్వ భూతాంతరాత్మ. నా ఆత్మే సర్వ భూతములలో భాసిల్లుచున్నదని భావించి కేవలం ఆత్మౌపమ్య భావనిష్ఠలో నిలచిన జ్ఞాని సర్వమును తనలో, సర్వములో తనను దర్శించ గలుగును. ఇట్టి అఖండాత్ముని దైవస్ధితిలో పూజించినను దోషంలేదు. ఇట్టి అఖండ జ్ఞానమును ప్రతివారు సంపాదించి అనుభూతి చెందాలి. హృదయమునుండే శక్తి వస్తుంది. హృదయమే శక్తి స్ధానం. గుదస్ధానమునుండి వెన్నెముకలోని వెన్నుపూసలద్వారా సుషుమ్న నాడి సహస్రారపర్యంతం అంతమౌతుంది. సిద్ధుల నిమిత్తం యోగులు ఈ నాడిని సాధించుటకై ధ్యానించెదరు. దీనిని ఆత్మ నాడి, పరా నాడి, అమృత నాడి అనెదరు. ఇది శక్తి కేంద్రమైన హృదయంలో పుట్టి సహస్రారంలో కలుస్తుంది. సుషుమ్న నాడికి సైతం ఆత్మ నాడియే శక్తినిస్తుంది. యోగ శాస్త్రం సహస్రారం అంతటికి మూలమంటుంది. పురుష సూక్తం హృదయమంటుంది. ఎట్టి సందేహములకు తావులేని ప్రత్యక్షాను భవమైన నేనుపై దృష్టి నిలిపిన ఆ నేనే ఆత్మలోకి తీసుకెళుతుంది. “నేను” విచారణను మించిన ధ్యానంగాని, సమాధిగాని లేదు. హృదయమే జీవునికి మూలస్ధానం. ఇది ఆత్మయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో. అసలైన ‘నేను’ స్ఫురణతో సదా విహరించ నేర్చుకో

  2. rathnam.sjcc says:

    ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను ఆత్మవున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా ఆత్మ నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. దేహం లేదు అప్పుడు ఉండేది పరమాత్మ మాత్రమే. ఆస్థితిలో ఉన్నారు అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అయిన కి చెప్పడానికి వీలు కానటువంటి

  3. rathnamsjcc says:

    నిన్ను నీవు నిండా తెలుసుకున్నట్లైతే నీ స్వరూపమే పూర్తిగా మారి పోతుంది. నీలో జ్ఞాన తరంగాలు వెల్లివిరుస్తాయి. … మనసు నిలిపి శుద్ధి ఆత్మనిష్ఠకు తోడ్పడుతుంది. నిన్ను నీవు తెలుసు కొను స్ధితిలో ఏ బ్రహ్మరాతలు నిన్ను అడ్డగించలేవు. దేనికైనను దైవా నుగ్రహం సహకరించవలయునని సమస్త భక్తులు మరువరాదు. నీవు ఒక వ్యక్తివద్ద బాకీ తెచ్చుకున్నావనుకో. ఆ బాకీని అడుగను అని రుణపత్రం చింపివేసిన పిదప బాకీ వసూలుచేసే వారెవరు ఉండరు. తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి.

Leave a comment