విశ్లేషణ – తీర్థయాత్ర


తీర్థయాత్ర చేయడమనేది హిందువులలో అనాదిగా వస్తున్నా సంప్రదాయం. రామాయణ, మహాభారత, అష్టాదశ పురాణాలలో భరత ఖండానికి ఉన్న ప్రాశస్త్యం ఇంతింత అనరానిది. అట్టి మహాకావ్యాలను విన్న మన హిందువులలో పుణ్యక్షేత్రాలను కళ్ళారా చూడాలన్న ఆకాంక్ష ఏర్పడింది. అదే తీర్తయాత్రగా పరిణమించింది.

దేశాటనం గురించిన ఒక చిన్న శ్లోకం.

‘యస్తు పర్యటతే దేశాన్
యస్తు సేవేత పండితాన్
తస్యవిస్తారితా బుద్ధిః
తైలబిందు రివాంభన’

ఎవడు వివిధ దేశాలను పర్యటిస్తాడో, ఎవడు పండితులను సేవిస్తాడో వాడి బుద్ధి నీటిమీది తైలబిందువులాగ విస్తరిస్తుంది. ఇది తీర్థయాత్రలకు కూడ అన్వయిస్తుంది.

పుణ్యక్షేత్రాలను దేవాలయాలను దర్శించేవాళ్ళ హృదయాలెప్పుడు నిష్కల్మషాలై ఆ పరమాత్ముని ధ్యానంలో ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలి. 

‘న కాష్ఠే విద్యతే దేవో న శిలాయాం కదాచన|
భావేహి విద్యతే దేవ స్తస్మాద్ భావం సమాశ్రయేత్||
సదేవః పర్వతా గ్రేషు న దేవః శివ పద్మని|
దేవశ్చిదానంద మయో హృది భావేన దృశ్యతే||’

– దేవుడు ఆరణ్యంలో లేడు. శిలలో లేడు భక్తుడిలో పూజ్యభావం ఉంటే అక్కడే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. దేవుడు పర్వతాగ్రంలో లేడు. దేవుడు జలంలోలేడు. భక్తుడి హృదయంలోనే భగవంతుడు ప్రత్యక్ష మవుతాడు. అందువల్లనే తీర్థయాత్ర చేసేవాళ్ళు శ్రేష్ఠభావాన్ని పొండడానికి ప్రయత్నించాలి.

Leave a comment